Go to full page →

ఆలసానికి సమయం లేదు ChSTel 87

“యెహోవా మహాదినము సమీపమాయెను, యెహోవా దినము సమీపమై అతి శీఘ్రముగా వచ్చుచున్నది” జెఫన్యా 1:14. సువార్త పాదరక్షలు ధరించి ఒక్క క్షణం వ్యవధిలో ముందుకి పోటానికి సిద్ధంగా ఉండాలి. టెస్టిమొనీస్, సం.9, పు. 48. ChSTel 87.2

సంఘ సభ్యులు... ప్రభువు ఆదేశాలకు విధేయులై కార్యాచరణ చేపట్టటానికి సిద్దంగా ఉండాలి. చేయటానికి సిద్దంగా ఉన్న పని ఎక్కడైనా కనిపిస్తే దాన్ని తీసుకుని నిత్యం యేసు వంకచూస్తూ చెయ్యాలి.... ప్రతీ సంఘసభ్యుడు సజీవ మిషనెరీ అయి ఉంటే సువార్త అన్ని దేశాల్లో, అన్ని ప్రజావర్గాలకు, అన్ని జాతులకు, అన్ని భాషలు మాట్లాడే ప్రజలకు వేగవంతంగా ప్రకటితమౌతుంది. టెస్టిమొనీస్, సం.9, పు. 32. ChSTel 87.3

మనం లోకచరిత్ర చరమ ఘట్టాలకు వస్తున్నాం. జరగాల్సిన గొప్ప పని మన ముందున్నది. పాపలోకానికి అందించాల్సిన చివరి హెచ్చరికను అందించాల్సిన చివరి కార్యం అది. దున్నుతున్న పొలాలనుంచి, ద్రాక్షతోటల నుంచి, వివిధ సేవా విభాగాల నుంచి మనుషుల్ని తీసుకుని ఈ వర్తమాన్ని లోకానికి ప్రకటించటానికి ప్రభువు పంపుతాడు. టెస్టిమోనీస్, సం.7, పులు. 270, 271. ChSTel 87.4

లోకం ఈ చివరినుంచి ఆ చివరికి ప్రమాద ఘంటికలు మోగించండి. ప్రభువు మహాదినం సమీపమయ్యిందని అది అతి శీఘ్రంగా వస్తున్నదని ప్రజలకు చెప్పండి. హెచ్చరిక అందనివారు ఎవరూ ఉండకూడదు. దోషంలో ఉన్న ఆ అభాగ్య ఆత్మల స్థానంలో మనం ఉండిఉండవచ్చు. అనాగరక ప్రజల నడుమమనం ఉండి ఉండవచ్చు. ఇతరులకన్నా ముందుగా మనం పొందిన సత్యం ప్రకారం దాన్ని అందించటానికి మనం వారికి రుణపడి ఉన్నాం . టెస్టిమొనీస్, సం.6, పు. 22. ChSTel 87.5

నా సోదర సోదరీల్లారా, మీ సమయాన్ని శక్తిని స్వార్థ క్రియలకు వినియోగించటానికి ఇక సమయంలేదు. చివరిరోజు మీరు పరలోకంలో ధనం కూర్చుకోలేదని ప్రకటించకుండునుగాక. సిలువ విజయాల్ని ప్రజల ముందుంచటానికి ప్రయత్నించండి. ఆత్మల్ని చైతన్యపర్చటానికి ప్రయత్నించండి. సాటి మనుషుల రక్షణ కోసం కృషి సల్పండి. అప్పుడు మీ సేవ అగ్ని పరీక్షను తట్టుకుంటుంది. టెస్టిమొనీస్, సం.9, పు. 56. ChSTel 88.1

ఈ వర్తమానాన్ని మనం త్వరగా వాక్యం వెంబడి వాక్యం, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞగా అందించాలి. మనుషులు త్వరలో గొప్ప తీర్మానాలు చేసుకుంటారు. న్యాయం పక్క నిలబడేందుకు సత్యాన్ని అవగాహన చేసుకోటానికి వారికి అవకాశం కల్పించటం మన విధి. కృపకాల ఇంకా ఉండగానే పని చెయ్యటానికి - చిత్తశుద్ధితోను జ్ఞానయుక్తంగాను పని చెయ్యటానికి - ప్రభువు తన ప్రజలకి పిలుపునిస్తున్నాడు. టెస్టిమొనీస్, సం.9, పు. 126, 127. ChSTel 88.2

మనం సమయం పోగొట్టుకోకూడదు. అంతం సమీపంలో ఉంది. సత్యాన్ని స్థలం నుంచి స్థలానికి అందించంలో కుడిఎడమల అపాయాలు ఎదురవుతాయి. దైవ సేవకుల్ని అడ్డుకోటానికి ప్రతీ ఆటంకాన్ని కలిగిస్తారు. ఇప్పుడు ఏదైతే చెయ్యటం స్యామో దాన్ని వారు అప్పుడు చెయ్యలేరు. మనం మన పనిని పరిశీలించి ఆకళించుకుని సాధ్యమైనంత వేగంగా, యుద్ధప్రాతిపదికన పురోగమించాలి. కిందనుంచి పొందిన శక్తితో అంధకార శక్తులు పనిచేస్తున్నాయని తోడేలు తన వేటను తీసుకునే రీతిగా ఇప్పుడు నిద్రిస్తున్నవారిని తీసుకోటానికి సాతాను నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ ముందుకి సాగుతున్నాడని దేవుడిచ్చిన వెలుగును బట్టి నేనెరుగును. మనం ఇవ్వాల్సిన హెచ్చరికలు ఇప్పుడు మనకున్నాయి. ఇప్పుడు మనం చెయ్యాల్సిన పని ఉన్నది. అయితే త్వరలో అది చెయ్యటం మనం ఊహించలేనంత కష్టమౌతుంది. వెలుగులో నిలవటానికి, మన నాయకుడైన యేసు పై దృష్టిని కేంద్రీకరించి పని చెయ్యటానికి, విజయం సాధించటానికి సహనంతో పట్టుదలతో ముందుకు పోవటానికి దేవుడు మనకు తోడై ఉండునుగాక. టెస్టిమొనీస్, సం.6, పు. 22. ChSTel 88.3

ఆలస్యంలో అపాయముంది. మీరు కనుగోగలిగి ఉండే ఆత్మ, మీరు ఎవరికి లేఖనాలు తెరవగలిగి ఉండేవారో ఆ ఆత్మ, మీ అందుబాటులో లేకుండా దాటిపోతుంది. అతడి కాళ్లకు ఏదో ఉచ్చును సాతాను అమర్చుతాడు. రేపు అతడు దైవ ప్రత్యర్థి ప్రణాళికల్ని అమలుపర్చే వ్యక్తిగా పనిచెయ్యవచ్చు. ఒక్కరోజైనా ఆలస్యం ఎందుకు జరగాలి? వెంటనే పని ఎందుకు ప్రారంభించకూడదు? టెస్టిమొనీస్, సం.6, పు. 443. ChSTel 89.1

ప్రతీ యుగంలోను క్రీస్తు అనుచరులు జాగరూకులై నమ్మకంగా నివసించాలి. అయితే ఇప్పుడు మనం నిత్యరాజ్యం అంచున నిలబడి ఉన్నాం గనుక, మనకున్న సత్యాలు మనకున్న వెలుగు గొప్పవి గనుక, మన పని ఎంతో ప్రాముఖ్యం గలది గనుక మనం రెండు రెట్లు జాగరూకులమై ఉండాలి. ప్రతీ వ్యక్తి తాను చెయ్యగలిగినదంతా చెయ్యాలి. నా సోదరుడా, ఇప్పుడు నీవు ఏమి చెయ్యకుండా ఉంటే నీ రక్షణను పోగొట్టుకునే ప్రమాదముంది. నీకు దేవుడు నియమించిన పనిని నీవు చెయ్యకపోతే దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు. టెస్టిమొనీస్, సం.5, పు. 460,461. ChSTel 89.2