Go to full page →

ప్రాముఖ్యమైన ప్రశ్నలు ChSTel 89

మన ముందు నిత్యత్వం విస్తరించి ఉంది. తెర లేవటానికి సిద్దంగా ఉంది. మన చుట్టూ ఆత్మలు నశించిపోతుంటే మనం మన స్వార్థ సుఖ ప్రేమలో మునిగిపోవటంలో ఏమనుకుంటున్నాం? ChSTel 89.3

మన హృదయాలు పూర్తిగా కఠినమైపోయాయా? ChSTel 89.4

ఇతరులకు మనం చెయ్యాల్సిన పని ఉన్నదని చూసి దాన్ని అవగాహన చేసుకోగలమా? ChSTel 89.5

నా సోదర సోదరీల్లారా, కళ్లుండి చూడలేనివారు, చెవులుండి వినలేని వారిలా మనం ఉన్నామా? దేవుడు తన చిత్రాన్ని గూర్చిన జ్ఞానాన్ని మీకివ్వటం వ్యర్థమేనా? ChSTel 89.6

అంతం సమీపంలో ఉన్నదని హెచ్చరిక వెంట హెచ్చరిక ఆయన మాకు పంపటం వ్యర్థమేనా? ChSTel 90.1

లోకం మీదికి రానున్న నాశనం గురించి ఆయన వాక్యం చేస్తున్న ప్రకటనల్ని మీరు నమ్ముతున్నారా? ChSTel 90.2

లోకనివాసుల తలల పై పడటానికి దేవుని తీర్పులు వేచి ఉన్నాయని మీరు నమ్ముతున్నారా? నమ్మితే మీరు సుఖంగా, అజాగ్రత్తగా, ఉదాసీనంగా ఎలా కూర్చో గలరు? టెస్టిమొనీస్, సం.9, పులు. 26.27. ChSTel 90.3