Go to full page →

మేల్కొల్ను పిలుపు ChSTel 90

అంతరాయాలు ఏర్పడి పనివేగంగా ఆగిపోతుంది. అన్ని పక్కలా దుర్మార్గం పెచ్చరిల్లుతుంది. పని చెయ్యటానికి మనకు చాలా తక్కువ సమయం ఉంది. మనం మన ఆధ్యాత్మిక గాఢ నిద్రనుంచి మేల్కొని మన సర్వాన్నీ, మనల్ని మనం ప్రభువుకి సమర్పించుకోవాలి. ఆయన ఆత్మ నిజమైన మిషనరీలతో ఉంటాడు. సేవ చెయ్యటానికి వారికి శక్తి నిస్తాడు. సదర్న్ వాచ్ మేన్, ఏప్రి. 9, 1903. ChSTel 90.4

సహోదరులారా, సహోదరీల్లారా, లేవండి, లేవండి, నిద్రపోకండి! “ఇక్కడ దినమంతయు మీరెందుకు ఊరకనే నిలిచియున్నారు?” “నేడు పోయి ద్రాక్షతోటలో పనిచేయుము” అంటూ యేసు పిలుస్తున్నాడు. ఎవరు పరిశుద్ధాత్మను పొందుతారో వారు దాన్ని కనపర్చుతారు.ఎందుకంటే పరిశు ద్దాత్మను పొందిన వ్యక్తి తన శక్తులన్నింటనీ క్రియాశీలక సేవలో వినియోగిస్తాడు. విశ్వాసం ద్వారా క్రీస్తును అంగీకించిన వారందరు సేవ చేస్తారు. ఆత్మల రక్షణ భారం వారి హృదయాల పై ఉంటుంది. సత్యజ్ఞానం ఉన్న వారిని, పరిశుద్ద సత్యానికి ధర్మకర్తలైనవారిని, పరలోకపు వెలుగును ఇతరులికి అందించటానికి లేచి వెళ్లాల్సిందిగా దేవుడు పిలుస్తున్నాడు. రివ్యూ అండ్ హెరాల్డ్, డిసె. 6, 1893. ChSTel 90.5

సహోదరులారా, నిద్రలేవండి. మా సొంత ఆత్మనిమిత్తం మేల్కొండి. క్రీస్తు కృప లేకుండా మీరు ఏమి చెయ్యలేరు. కనుక మీరు చెయ్యగలిగినప్పుడు పని చెయ్యండి. సదర్న్ వాచ్మేన్, జూలై 17, 1906. ChSTel 90.6

మేం సుఖంగా క్షేమంగా ఉన్నామని భావించేవారితో పనిచేస్తున్న దుష్టదూతల్ని చూడటానికి మనకళ్ళు తెరవబడితే, మనం అంత భద్రంగా ఉన్నట్లు భావించం. ప్రతీక్షణం దుష్టదూతలు మన మార్గంలో ఉంటారు. టెస్టిమొనీస్, సం.1, పు. 302. ChSTel 91.1

బోధకుల్ని ప్రజల్ని ఇరు వర్గాల్నీ మేల్కోవలసిందిగా దేవుడు పిలుస్తున్నాడు. లోక చరిత్ర ఘట్టాలు వేగంగా సమాప్తమౌతున్నాయి. మనం చివరి దినాల ఆపదల నడుమ నివసిస్తున్నాం. ఇంకా పెద్ద అపాయాలు మన ముందున్నాయి. అయినా మనం మొద్దు నిద్రమాని లేవటంలేదు. దేవుని పని విషయంలో నిష్క్రియాపరత్వం నిరాసక్తత భయంకర విషయం. మరణంతో సమానమై ఈ మొద్దు నిద్ర సాతానువల్ల కలుగుతున్నది. టెస్టిమొనీస్. సం.1, పులు. 260, 261. ChSTel 91.2

శేషించిన దైవ ప్రజల్ని మేల్కొల్పటానికి నేనేం చెప్పాలి? మన ముందున్న భయంకర దృశ్యాల్ని నేను దర్శనంలో చూశాను. సాతాను అతడి దూతలు దైవ ప్రజల పై తమ శక్తులన్నింటిని ప్రయోగిస్తున్నారు. వారు ఇంకా కొంత సేపు నిద్రపోతే వారిని వశపర్చుకోవచ్చునని అతడికి తెలుసు. ఎందుకంటే వారి నాశనం ఖాయం . టెస్టిమొనీస్, సం.1, పు. 263. ChSTel 91.3

మానవులకు కృపకాలం ముగియనున్న ఈ చివరి గడియల్లో, ప్రతీ ఆత్మ విధి నిత్యకాలికంగా త్వరలో తీర్మానించాల్సి ఉన్న ఈ సమయంలో ఇహపరలోకాల ప్రభువు తన సంఘం మేల్కొని మును పెన్నడూ జరగని రీతిగా కార్యాచరణ చేపట్టాల్సిందిగా కోరుతున్నాడు. ప్రశస్త సత్య జ్ఞానం ద్వారా క్రీస్తులో స్వతంత్రులైనవారిని ప్రభువైన యేసు తన స్వకీయ ప్రజలుగా లోకంలోని ప్రజలందరికన్నా తన అభిమానాన్ని చూరగొన్న జనంగా పరిగణిస్తున్నాడు. చీకటిలోనుంచి ఆశ్చర్యకరమైన తన వెలులోకి తమను పిలిచిన తన గుణాతిశయాల్ని ప్రకటించటానికి ఆయన వారిమీద ఆధారపడి ఉన్నాడు. ఆయన తమకు ఉదారంగా అనుగ్రహించిన ఆశీర్వాదాల్ని గూర్చి వారు ఇతరులుకి చెప్పాలి. రక్షణ శుభవార్త ప్రతి వంశానికి, ఆయాభాషలు మాట్లాడేవారికి ప్రతీ ప్రజకు అందించాలి. ప్రోఫెట్స్ అండ్ కింగ్స్, పులు. 716, 717. ChSTel 91.4

సామాన్య ప్రాపంచిక వ్యవహారాల్లో నిమగ్నమవ్వటానికి మించి మనలో నూటికి ఒక వ్యక్తి కూడా ప్రభువు నిమిత్తం ఏమి చెయ్యటం లేదు. క్రీస్తు ఎవరి కోసం మరణించాడో ఆ ఆత్మల విలువను మనం సగం కూడా గ్రహించటంలేదు. టెస్టిమొనీస్, సం.8, పు. 148. ChSTel 92.1

క్రీస్తు అనుచరులు తమ విధిని గుర్తిస్తే అన్యదేశాల్లో సువార్త ప్రకటించటానికి ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్న చోట వేలమంది ఉండేవారు. అయితే ఈ సేవలో వ్యక్తిగతంగా పాలు పొందలేనివారందరూ తమ ద్రవ్యం, సానుభూతి, ప్రార్థనల ద్వారా పాల్గోవచ్చు. క్రైస్తవ దేశాల్లో ఆత్మల రక్షణకు మరెక్కువ యదార్ధ సేవ జరుగుతుంది. స్టెప్స్ టు క్రైస్ట్, పు. 81. ChSTel 92.2

వేలమంది గొప్ప వెలుగును, విలువై అవకాశాల్ని కలిగి ఉంటారు. కాని ఇతరుల్ని చైతన్య పర్చటానికి, తమ ప్రభావాన్ని లేక ద్రవ్యాన్ని వినియోగించరు. సంఘానికి భారంగా ఉండకుండేందుకు వారు తమ ఆత్మల్ని దేవుని ప్రేమలో ఉంచుకునే బాధ్యత కూడా తీసుకోరు. అలాంటివారు క్రీస్తు కోసం, సత్యం కోసం, తమ కోసం మేల్కొని చిత్తశు ద్దితో నిత్యజీవం కోసం, పాటుపడాలి. రివ్యూ అండ్ హెరాల్డ్, మార్చి 1, 1887. ChSTel 92.3

క్రీస్తు సంఘాన్ని ఓ సేవతో సరిపోల్చటం సమంజసం. ప్రతీ సైనికుడి జీవితం శారీరక శ్రమతో, కష్టాలతో, అపాయంతో నిండి ఉంటుంది. ఎన్నడూ నిద్రపోని, ఎన్నడూ తన స్థానాన్ని విడిచి వెళ్లని అంధకారశక్తుల యువరాజు నేతృత్వంలో అన్నిచోట్ల అప్రమత్తులైన శత్రువులుంటారు. ఎప్పుడైనా ఓ క్రైస్తవుడు అజాగ్రత్తగా ఉంటే, శక్తిమంతుడైన ఈ శత్రువు అకస్మాత్తుగా, దౌర్జన్య పూరితంగా దాడి చేస్తాడు. సంఘసభ్యులు కార్యశీలంగా, అప్రమత్తంగా ఉండకపోతే అతడు తన జిత్తులతో వారిని జయిస్తాడు. ChSTel 92.4

విధి నిర్వహణకు ఆజ్ఞ వచ్చినప్పుడు మన సైన్యంలో సగం మంది నిష్కియులై లేక నిద్రమత్తులై ఉంటే ఏం జరుగుతుంది? ఫలితం పారాజయం, చెర లేదా మరణం. వైరి చేతుల్లోనుంచి ఎవరైనా తప్పించుకుంటే, వారు బహుమతికి అర్హులుగా పరిగణన పొందుతారా? పొందరు. వారు తక్షణమే మరణ శిక్షకు గురి అవుతారు. క్రీస్తు సంఘం అజాగ్రత్త గా లేక అపనమ్మకంగా ఉంటే, మరింత ముఖ్యమైన పర్యవసానాలుంటాయి. నిద్రపోతున్న క్రైస్తవ పటాలం - ఎంత భయంకర విషయం! చీకటి యువరాజు నియంత్రణ కింద ఉన్న లోకం పై ఎలాంటి దాడి చెయ్యాలి? యుద్ధం జరిగే దినాన ఆ సమరానికి సంబంధించిన విషయాల్లో తమకు ఆసక్తి లేనట్లు వాటి సందర్భంగా తమకెలాంటి బాధ్యతలేనట్లు ఉదాసీనంగా నిలబడి ఉండి పోయేవారు తమ మార్గాన్ని మార్చుకోటం లేదా సైన్యాన్ని వెంటనే విడిచి పెట్టటం మంచిది. టెస్టిమొనీస్, సం.5, పు. 394. ChSTel 92.5