Go to full page →

ఆధ్యాత్మిక పక్షవాతం ChSTel 122

వ్యాయామం వలన శక్తి చేకూరుతుంది. తమకు దేవుడిచ్చిన సామర్ధ్యాన్ని ఉపయోగించేవారందరు ఆయన సేవకు వినియోగించేందుకు పెంపొందిన సామర్థ్యం కలిగి ఉంటారు. దేవునికి ఎలాంటి సేవా చెయ్యనివారు కృపలోను సత్యాన్ని గూర్చిన జ్ఞానంలోను పెరగరు. పడుకుని ఉంటూ, తన కాళ్లు చేతులికి వ్యాయామం చెయ్యటానికి నిరాకరించే మనిషి త్వరలో వాటిని ఉపయోగించలేని స్థితికి చేరుకుంటాడు. అలాగే, దేవుడు తనకిచ్చిన శక్తుల్ని ఉపయోగించని క్రైస్తవుడు క్రీస్తులో పెరగకపోటమేగాక తనకున్న శక్తిని కూడా కోల్పోతాడు. అతడు ఆధ్యాత్మిక పక్షవాత రోగి అవుతాడు. దేవుని పట్ల తోటి మానవులపట్ల ప్రేమ కలిగి ఇతరులకు సహాయమందించటానికి కృషి చేసేవారే సత్యంలో స్థిరంగా, బలంగా నిలిచేవారు. యధార్ద క్రైస్తవుడు భావోద్రేకాన్ని బట్టి కాక నియమాన్ని బట్టి దేవునికి సేవ చేస్తాడు. అది ఒక రోజు లేక ఒక నెల మాత్రమే కాదు, జీవితమంతా చేసే సేవ. టెస్టిమొనీస్, సం.5, పు. 393. ChSTel 122.1