Go to full page →

కచ్చితమైన పరిష్కారం ChSTel 122

అధైర్యం చెందిన వారికి కచ్చితమైన పరిష్కారం - విశ్వాసం, ప్రార్ధన, పని. విశ్వాసం క్రియాత్మకత దినదినం పెరిగే నమ్మకాన్ని తృప్తిని ఇస్తాయి. మీరు ఆందోళన, భయం లేదా నిస్పృహకు తావిస్తున్నారా? గాఢ చీకటి దినాల్లో ఆకారాలు రూపాలు భయంకరంగా కనిపించినప్పుడు భయపడకండి. దేవుని పై విశ్వాసముంచండి. మీ అవసరం ఏంటో ఆయనకు తెలుసు. ఆయన సర్వశక్తిమంతుడు. ఆయన అనంత ప్రేమ కరుణ అలు పెరగనివి. ఆయన తన వాగ్దానాన్ని నిలుపుకోడని భీతిల్లకండి. ఆయనే సత్యం. తనను ప్రేమించేవారితో ఆయన చేసిన నిబంధనను ఆయన ఎన్నడు మార్చడు. నమ్మకమైన తన సేవకుల అవసరానికి కావలసిన సామర్థ్యాన్ని వారికిస్తాడు. ప్రోఫెట్స్ అండ్ కింగ్స్, పులు 164,165. ChSTel 122.2

ఆధ్యాత్మిక సోమరి తనాన్ని కుదిర్చే అసలు సిసలు ఔషధం పని ఒక్కటే. మీ సహాయం అవసరమయ్యే ఆత్మలకోసం పనిచెయ్యటం. టెస్టిమొనీస్, సం. 4, పు. 236. ChSTel 123.1

బలహీనమైన, సందేహిస్తున్న, భయపడ్తున్న ఆత్మకు క్రీస్తు నిర్ణయిస్తున్న ఔషధం ఇదే. ప్రభువు ముందు విచారంగా నడిచే దుఃఖితుల్ని లేచి సహాయం అవసరమైననవారికి సహాయం చెయ్యనివ్వండి. టెస్టిమొనీస్, సం. 6 పు. 266. ChSTel 123.2

యధార్థ చిత్తతలో, ఉత్సాహంలో, నమ్మికలో, ప్రేమలో పెరిగే క్రైస్తవులు విశ్వాసంలో ఎన్నడూ వెనుతిరగరు. రివ్యూ అండ్ హెరాల్డ్, జూన్ 7, 1887. ChSTel 123.3

ఈ నిస్వార్థ సేవ చెయ్యనివారిది రోగగ్రస్తమైన అనుభవం. వారు పెనుగులాడూ, శంకిస్తూ, సణుగుకుంటూ, పాపంచేస్తూ, పశ్చాత్తాపపడుతూ, తుదకు నిజమైన మతమేంటో తెలియని స్థితికి చేరుకుంటారు. తాము తిరిగి లోకానికి వెళ్లలేమని భావిస్తారు. కనుక వారు సీయోను కొంగుపట్టుకుని వేలాడుతూ చిన్నచితక ద్వేషాలు, అసూయలు, ఆశాభంగాలు, పశ్చాత్తాపాలతో సతమతమౌతుంటారు. తప్పులెన్నటం, సహోదరుల పొరపాట్లు నేరాల్ని వేలెత్తి చూపించటమే తమ అన్నపానాలు చేసుకుంటారు. వారి మత జీవితం నిరీక్షణ లేకుండా, విశ్వాసం లేకుండా, ఆనందం లేకుండా సాగే మత తతంగం. రివ్యూ అండ్ హెరాల్డ్, సెప్టె. 2, 1890. ChSTel 123.4