Go to full page →

కలసిమెలసి ఉండండి ChSTel 141

క్రీస్తుతో పనిచేసేవారందరికి నేను చెప్పేదేంటంటే ఎక్కడ సాధ్యపడితే అక్కడ చలి మంట వద్ద ఉన్న ప్రజల వద్ద చేరి మీకున్న సమయాన్ని సద్వినియోగపర్చుకోండి. మీ బైబిలు తీసుకువెళ్లి అందులోని సత్యాల్ని వారి ముందు పెట్టండి. వారి హృదయాల్ని ఆకట్టుకోటానికి మా కృషి మిద మి జయం ఆధారపడి ఉండదు. చక్కని ప్రసంగం ద్వారా కన్నా కలసిమెలసి ఉంటూ ప్రజలకు చేరువవ్వటం ద్వారా, వారి ఆలోచనాధోరణి ఎక్కువ అనుకూలంగా మలుపు తిప్పవచ్చు. ఇటు అటు వెళ్తున్న జనసమూహాలకి ఆరుబయట చేసే ప్రసంగాలు లేక హళ్లలో చేసే ప్రసంగాలు, లేక ఆలయాల్లో చేసే ప్రసంగాల కన్నా కుటుంబంలో, చలిమంత పక్క, వ్యక్తిగత గృహాల్లో, చిన్న సమావేశాల్లో క్రీస్తుని సమర్పించటం తరచు ఎక్కువ విజయవంతమౌతుంది. గాస్ పుల్ వర్కర్, పు. 193. ChSTel 141.2

తన వాక్యాన్ని ప్రకటించేవారందరు, తన కృపాసువార్తను స్వీకరించే వారందరు మానవ ఆసక్తులతో తనను తాను అనుసంధానపర్చుకున్న క్రీస్తు ఆదర్శాన్ని అనుసరించాలి. మనం సాంఘిక సహవాసాన్ని పరిత్యజించకూడదు. మనం ఇతరులుకి దూరంగా ఉండకూడదు. అన్ని తరగతుల ప్రజల్ని చేరేందుకోసం వారు ఎక్కడుంటారో అక్కడ వారిని కలవాలి. వారు తమంతట తాము మనల్ని వెతుకుంటూ రావటం బహు అరుదు. దేవుడు మనుషుల హృదయాల్ని చలింపజెయ్యటానికి ప్రసంగ వేదిక ఒక్కటే సాధనంకాదు. మరో సేవా రంగముంది. అది సామాన్యమైనదే కావచ్చు కాని పూర్తిగా ఫలప్రదమైనది. దాన్ని దీనులు సామాన్యుల గృహంలో, గొప్పవారి భవనాల్లో, ఆతిథ్యపు భోజన బల్లవద్ద, చెడుగులేని సాంఘిక సమావేశాల్లో కనిపిస్తుంది. ది డిజైర్ ఆఫ్ ఏజెస్, పు. 152. ChSTel 141.3

క్రీస్తు తనకుతానే పరిమితమై నివసించలేదు. తమ కఠిన నిబంధనల్ని పాటించకపోటం ద్వారా పరిసయ్యులుకి ఆయన తీవ్ర అసంతృప్తి కలిగించాడు. అనుదిన జీవితానికి మిక్కిలి పవిత్రమన్నట్టు మతం చుట్టూ ఎత్తయిన గోడలు నిర్మించిదాన్ని ప్రత్యేకంగా ఉంచటం ఆయన కనుగొన్నాడు. ఈ వేర్పాటు గోడల్ని ఆయన పడగొట్టాడు. మనుషులతో పరిచయం ఏర్పర్చుకునేటప్పుడు మీ మతమేంటి? మీ మత శాఖ ఏంటి? అని ఆయన ప్రశ్నించలేదు. సహాయం అవసరమైన వారందరికీ తన శక్తిని ఉపయోగించి సహాయం చేశాడు. తన పారలౌకిక స్వభావాన్ని చూపించటానికి ఏకాంతంగా ప్రత్యేకంగా ఉండేబదులు ఆయన మానవాళి శ్రయానికి శ్రమించాడు. బైబిలు మతం శరీరాన్ని బాధ పెట్టే మతం కాదన్న నియమాన్ని బోధించాడు. పవిత్రమైన నిష్కళంకమైన మతం నిర్దిష్ట సమయాలకి ప్రత్యేక సందర్భాలకే ఉద్దేశించబడింది కాదని ఆయన బోధించాడు. అన్ని వేళల్లోను అన్ని స్థలాల్లోను మనుషులపట్ల ప్రేమాసక్తులు ప్రదర్శించి తన చుట్టూ భక్తి ఆనందాల వెలుగును ప్రకాశింపజేశాడు. ది డిజైర్ ఆఫ్ ఏజెస్, పు. 193. ChSTel 142.1