Go to full page →

సానుభూతి పూర్వక ఆసక్తి ప్రదర్శించండి ChSTel 142

తీవ్ర కష్టాలతో జీవిత సమరం సాగిస్తున్న వారు ఖర్చేమోలేని చిన్న చిన్న గుర్తింపుల ద్వారా కాస్త విశ్రాంతి తాజాతనం శక్తి పొందవచ్చు. దయగల పలకరింపు, చిన్నచిన్న గుర్తింపులు ఆత్మను ఆవరించిన శోధన మేఘాల్ని సందేహాన్ని చెదరగొడతాయి. హృదయం క్రీస్తువంటి సానుభూతిని యధార్ధంగా, సామాన్యంగా వ్యక్తీకరించినప్పుడు సున్నిత స్పర్శ ఎవరికి అవసరమో వారి హృదయం ద్వారం తెరిచే శక్తి క్రీస్తు ఆత్మకుంటుంది. టెస్టిమొనీస్, సం.9, పు. 30. ChSTel 142.2

వేల హృదయాల్ని అతిసామాన్యమైన విధంగా చేరవచ్చు. లోకంలో మిక్కిలి సమర్థులుగా పరిగణన ప్రశంసలు పొందుతున్న ప్రతిభావంతులు, దేవుని ప్రేమించి, లౌకికులు తాము ఆలోచించే, ధ్యానించే విషయాలగురించి ఎంత స్వాభావికంగా మాట్లాడారో అంత స్వాభావికంగా ఆ ప్రేమను గురించి మాట్లాడే సామాన్యమైన మాటల వలన తరచు తాజాతనాన్ని ప్రశాంతతని పొందుతారు. ఆచితూచి ఎంచుకుని సిద్దం చేసుకున్న మాటలు తరచు ఏమంత ప్రభావవంతం కావు. కాని దేవుని కుమారుడు లేక కుమార్తె స్వాభావిక సామాన్యతతో పలికే యధార్ధమైన, నమ్మకమైన మాటలు చాలా కాలంగా మూతపడి ఉన్న హృదయ ద్వారాన్ని తెరుస్తాయి. టెస్టిమొనీస్, సం.6, పు. 115. ChSTel 143.1