Go to full page →

సువార్త వైద్య మిషనెరీలు ChSTel 148

ఇప్పుడు పనివారు - సువార్త వైద్యమిషనెరీలు - అవసరం. మీరు ఏళ్ల తరబడి సిద్దపడటానికి సమయం లేదు. ఇప్పుడు సత్యానికి తెరిచి ఉన్న తలుపులు మూయబడ్డాయి. అవి మరెన్నడు తెరవబడవు. కనుక వర్తమానం అందించటానికి ఇదే సమయం. ఆలస్యం చెయ్యటం ద్వారా ఇప్పుడు మీకు తెరిచి ఉన్న ప్రదేశాల్ని శత్రువు హస్తగతం చేసుకోనివ్వకండి. క్రీస్తు తన శిష్యులికి ఏ పని నియమించాడో ఆ పనిని చెయ్యటానికి చిన్న చిన్న గుంపులుగా ఏర్పడండి. మన ప్రచరణల్ని వెదజల్లుతూ, తాము కలిసేవారితో సత్యాన్ని గూర్చి ముచ్చటిస్తూ వారిని సువార్త సేవకులుగా పని చెయ్యనివ్వండి. వారిని రోగుల కోసం ప్రార్ధన చెయ్యనివ్వండి, వారికి అవసరమైన సేవలు చెయ్యనివ్వండి. ఇది మందులతో కాకుండా ప్రకృతి చికిత్స ద్వారా చేస్తూ, ఆరోగ్యాన్ని తిరిగి ఎలా సంపాదించుకుని వ్యాధిరాకుండా జాగ్రత్తలు తీసుకోవాలో బోధించటం ద్వారా చెయ్యాలి. టెస్టిమొనీస్, సం. 9, పు. 172. ChSTel 148.2

నా సోదర సోదరీలారా, దేవుని సేవకు మిమ్మల్ని మీరు ప్రతిష్టించుకోండి. ఆయన సేవకు ఉపయోగించుకోకుండా ఏ తరుణాన్నీ విడిచి పెట్టకండి. జబ్బుగా ఉన్నవారిని బాధలో ఉన్నవారిని పరామర్శించి వారిపట్ల ఆసక్తిని ప్రదర్శించండి. సాధ్యపడితే కొంత సుఖాన్ని కలిగించటానికి కొంత సాయం చెయ్యండి. ఈ సేవ ద్వారా మీరు వారి హృదయాన్ని చేరి క్రీస్తును గురించి ఒకటి రెండు మాటలు చెప్పవచ్చు. అలాంటి పరిచర్య ఫలితం ఎంత విలువైందో నిత్యత్వం మాత్రమే వెల్లడిచేస్తుంది. తమకు దగ్గరలో ఉన్న పనిని చెయ్యటానికి సమ్మతంగా ఉన్నవారి ముందు ఇతర ప్రయోజనకర సేవా మార్గాలు తెరవబడి ఉంటాయి. టెస్టిమొనీస్, సం. 9, పు. 36. ChSTel 148.3