Go to full page →

ప్రతీ సంఘంలో జరగాల్సిన సేవ ChSTel 157

ప్రతీ సంఘంలోను జరగాల్సిన ఆరోగ్య సంస్కరణ సేవను గూర్చిన వర్తమానం ఒకటి ఉంది. టెస్టిమొనీస్, సం. 6, పు. 370. ChSTel 157.5

దేశంలోని ప్రతీ సంఘ సేవలోను వైద్య మిషనెరీ సేవ ఓ భాగంపై ఉండాలి. టెస్టిమొనీస్, సం. 6, పు. 289. ChSTel 157.6

సంఘంలోని ప్రతీ సభ్యుడు వైద్య మిసనెరీ సేవను చేపట్టాల్సిన కాలానికి మనం వచ్చాం . టెస్టిమొనీస్, సం. 7, పు. 62. ChSTel 157.7

మన లోకంలోని బాధను తగ్గించటానికి, తన సంఘాన్ని శుద్దీకరించటానికి ఆరోగ్య సంస్కరణ సేవ ప్రభువు ఎంచుకున్న సాధనం. శారీరక, ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని పునరుద్ధరించటంలో సర్వోత్తమ కార్యకర్తతో సహకరించటం ద్వారా దేవునికి సహాయకులుగా వ్యవహరించగలరని ప్రజలకు బోధించండి. ఇది పరలోక అధికారం పొందిన సేవ. ప్రశస్త సత్యాల ప్రవేశానికి ఇది తలుపులు తెరుస్తుంది. ఈ సేవను విజ్ఞతతో చేపట్టే వారందరూ పని చెయ్యటానికి చోటుంది. టెస్టిమొనీస్, సం. 9, పులు. 112, 113. ChSTel 157.8

క్లిష్ట సమయాలు మన ముందున్నాయి. కాని మనం అపనమ్మకాన్ని లేక అధైర్యాన్ని సూచించే ఒక్కమాట పలకకూడదు. పాపరోగంతో బాధపడ్తున్న ప్రజలతో నిండిన లోకానికి స్వస్తతను గూర్చిన వర్తమానాన్ని మనం తీసుకువెళుతున్నామని గుర్తించుకుందాం. స్పెషల్ టెస్టిమోనీస్, పరంపర బి, నెం. 8, పు. 24. ChSTel 158.1

సరిగా నిర్వహిస్తే, సంఘాలు అశ్రద్ధ చేసిన అనేకమంది పాపుల్ని ఈ సేవ రక్షిస్తుంది. మన విశ్వాసానికి చెందని అనేకమంది క్రైస్తవులు అందించాల్సిన సహాయం కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. దైవ ప్రజలు తమ ఇరుగు పొరుగు వారిలో నిజమైన ఆసక్తి చూపిస్తే, ఈ దినాలకి ఉద్దేశించిన సత్యాలతో అనేకుల్ని చేరవచ్చు. ప్రజలకి తామున్న చోటే సహాయమందించటం ద్వారా సేవ పొందే ప్రతేకత మరి దేని ద్వారాను రాదు. దేవుని ప్రేమించి ఆయన ఆజ్ఞల్ని గైకొంటున్నట్లు చెప్పేవారు క్రీస్తు పని చేసినట్లు పని చేస్తే నేడు వేల ప్రజలు మన వర్తమానంలో ఆనందించేవారు. వైద్య మిషనెరీ సేవ ఇలా స్త్రీ పురుషులికి క్రీస్తు రక్షణ జ్ఞానాన్ని సత్యాన్ని అందించినప్పుడు దానిలో ద్రవ్యాన్ని నమ్మకమైన సేవను క్షేమంగా పెట్టుబడి పెట్టవచ్చు. ఎందుకంటే అది స్థిరమైన సేవ. టెస్టిమొనీస్, సం. 6, పు. 280. ChSTel 158.2

వైద్య మిషనెరీ సేవలో తమకు ఆసక్తి ఉన్నదని మన ప్రజల్ని చూపించనివ్వండి. ఈ శాఖల్లో ఉపదేశం నిమిత్తం ప్రచురితమైన పుస్తకాలు అధ్యయనం చేయటం ద్వారా మన ప్రజలు ప్రయోజకులు కావటానికి సిద్ధపడనివ్వండి. ఈ పుస్తకాల పై ఇప్పటికన్నా మరింత శ్రద్ధ పెట్టటం మంచిది. అందరు అవగాహన చేసుకుని మేలు పొందటానికి అవసరమైన విషయం చాలా రాయబడింది. అది ప్రత్యేకంగా ఆరోగ్య నియమాల్ని గూర్చి ఉపదేశించటాని రాయబడిన విషయం. ఈ నియమాల్ని అధ్యయనం చేసి ఆచరించేవారు శారీరకంగాను ఆధ్యాత్మికంగాను ఎంతో లబ్ది పొందుతారు. ఆరోగ్యానికి సంబంధించిన వేదాంతాన్ని గూర్చిన అవగాహన నిత్యం పెరుగుతున్న దుష్టి నుంచి దుర్మార్గాల నుంచి రక్షావలయంగా ఉంటుంది. టెస్టిమోనీస్, సం. 7, పు. 63. ChSTel 158.3

అగాధ భ్రష్టత్వంలోను, మితం లేని వ్యసనాల్లోను కూరుకుపోయి నప్పటికీ మనుషులు సరిఅయిన పరిచర్యకు స్పందిస్తారని వైద్య మిషనెరీ సేవ కనుగొంటుందని నాకు ఉపదేశం వచ్చింది. అయితే వారిని గుర్తించి ప్రోత్సహించటం అవసరం. వారిని తామున్న స్థితినుంచి పైకి లేపటానికి పటిష్టమైన, సహనంతో కూడిన కృషి అవసరం. వారు తమను తాము పునరుద్దరించుకోలేరు. వారు క్రీస్తు పిలుపును వినవచ్చుగాని వారి చెవులు మందకొడిగా ఉండటంవల్ల దాని భావాన్ని అవి గ్రహించలేవు. తమ కళ్లకు అంధత్వం కలగటం వల్ల తమకు మంచి ఉన్నట్లు వారు చూడలేరు. వారు అపరాధాలు పాపాల్లో మృతులై ఉన్నారు. అయినా వీరిని సయితం సువార్త విందు నుంచి మినహాయించకూడదు. “రండి” అన్న ఆహ్వానాన్ని వారికి అందించాలి. వారు అయోగ్యులైనప్పటికీ, “లోపలికి వచ్చుటకు... వారిని బలవంతము చేయుడి” అని ప్రభువంటున్నాడు. సాకులు వినకండి. ప్రేమతోను దయతోను వారిని స్వీకరించండి. టెస్టిమొనీస్, సం. 6, పులు. 279, 280. ChSTel 159.1

ఈ సేవను [ప్రచురణల ప్రసారం] చేపట్టేవారు వైద్యమిషనెరీ సేవ చెయ్యటానికి సిద్దపడి వెళ్లాలి. వ్యాధిగ్రస్తుల్ని, బాధలో ఉన్నవారిని ఆదుకోవాలి. ఈ కృపా పరిచర్య ఎవరికి చేస్తామో వారిలో అనేకులు జీవ వాక్కుల్ని వింటారు. టెస్టిమొనీస్, సం. 9, పు. 34. ChSTel 159.2

వైద్యమిషనెరీ సేవను ఎవరు అవగామనతో అంగీకరించటానికి సిద్దపడ్తున్నారు?... ప్రతీ సేవకుడు అవగాహన సమర్ధత కలిగి పనిచెయ్యాలి. అప్పుడు సత్యాన్ని యేసులో ఉన్నట్లు ఉన్నతమైన విస్తృతమైన భావంతో అతడు సమర్పించగలుగుతాడు. టెస్టిమొనీస్, సం. 7, పు. 70 ChSTel 159.3

ప్రభువు సేవను ముందుకి సాగనివ్వండి. వైద్యమిషనెరీ సేవను విద్యాసేవను పురోగమించనివ్వండి. చిత్తశుద్ధి అంకితభావం వివేకం సమర్ధత గల పని వారి కొరతే మన గొప్ప కొరతని నా నమ్మకం. టెస్టిమొనీస్, సం. 9, పులు. 168, 169. ChSTel 159.4

ఈ సజీవ ఆరోగ్యనియమాల విషయంలో చాలామటుకు అజ్ఞానులున్న సమాజాల్లోకి వారు ఈ నియమాన్ని తీసుకువెళ్లాలి. టెస్టిమొనీస్, సం. 9, పు. 118. ChSTel 159.5

“ముందుకి సాగండి” అని ఆరోగ్య సంస్కరణ ఉపదేశకులికి చెప్పవలసిందని నేను ఆదేశం పొందాను. నైతిక దుస్థితిని వెనక్కి నెట్టివెయ్యటానికి మీరు చూపగల ప్రభావమంతా లోకానికవసరం. మూడోదూత వర్తమాన ప్రబోధకులు తమ బోధకు నిజాయితీగా నిలురు గాక! టెస్టిమొనీస్, సం. 9, పు. 113. ChSTel 160.1