తిండికి బానిసలవ్వటం వల్ల చోటుచేసుకునే పర్యవసానాల్ని వివరిస్తూ ఎన్నో దృష్టాంతాలు ఇవ్వవచ్చు. ఆ ఒక్క కార్యంలో దేవుని ఆజ్ఞను అతిక్రమించటం చూడటానికి అందంగానూ, రుచికి మధురంగానూ ఉన్న పండు తినటం - మన మొదటి తల్లిదండ్రులికి చిన్న విషయంగా కనిపించింది. కాని అది దేవునితో వారికున్న బాంధవ్యాన్ని తెంచి, లోకాన్ని ముంచిన అపరాధపు వరదకు లాకులు తెరిచింది. CDTel 147.4