(1868) 2T 65 CDTel 155.7
243. మనం దేవుని కట్టడల్ని, న్యాయవిధుల్ని గుర్తించినప్పుడు అన్ని విషయాల్లోను మనం మితంగా ఉండాలని ఆయన కోరుతున్నట్లు గుర్తిస్తాం. మనల్ని సృజించటంలో ఆయన ఉద్దేశం మన శరీరంతోను ఆత్మతోను ఆయన్ని మనం మహిమపర్చాలన్నదే. మన శరీరాత్మలు ఆయనవే. మన శరీరానికి నైతిక శక్తులికి హాని కలిగేరీతిగా మనం తింటూ తాగుతూ ఉంటే ఆయన్ని ఎలా మహిమ పర్చగలం? మన శరీరాల్ని తనకు సజీవ యాగంగా సమర్పించాల్సిందిగా దేవుడు మనల్ని కోరుతున్నాడు. ఆ విధిని నెరవేర్చేందుకు గాను ఆ శరీరాన్ని ఉత్తమ ఆరోగ్యస్థితిలో ఉంచే బాధ్యత మనమీద ఉంది. “మీరు భోజనము చేసినను పాపము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి.” CDTel 155.8
(1900) 6T 374,375 CDTel 156.1
244. అపోస్తలుడైన పౌలు ఇలా రాస్తున్నాడు: “పందెపు రంగమందు పరుగెత్తు వారందరును పరుగెత్తుదురుగాని యొక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా? అటువలె మీరు బహుమానము పొందునట్లుగా పరుగెత్తుడి. మరియు పందెమందు పోరాడు వారు అన్ని విషయములయందు మితముగా ఉండును. వారు క్షయమగు కిరీటము పొందుటకును మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. కాబట్టి నేను గురి చూడనివానివలె పరుగెత్తు వాడను కొను. గాలిని కొట్టునట్టు నేను పోట్లాడుట లేదుగాని ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనై పోదునేమో అని నా శరీరమును నలగగొట్టి, దానిని లోపరచుకొనుచున్నాను.” కొరింథీ 9:24,29. CDTel 156.2
హానికరమైన అలవాట్లు గలవారు లోకంలో అనేకమంది ఉన్నారు. వారిని శాసించే చట్టం ఆహారవాంఛ. వారి తప్పుడు అలవాట్ల వల్ల నైతిక స్పృహ మసకబారి పరిశుద్ధ విషయాల్ని గ్రహించే శక్తి చాలామట్టుకు నాశనమౌతుంది. అయితే క్రైస్తవులు మితంగా ఉండటం అవసరం. వారు తమ ప్రమాణాన్ని ఉన్నతంగా ఉంచుకోవాలి. తినటంలో తాగటంలో బట్టలు ధరించటంలో మితం పాటించాలి. నియమం శాసించాలి గాని రుచిగాని ఇష్టం గాని కాదు. ఎక్కువ తినేవారు లేదా ఎవరు తినే తిండి అభ్యంతరకరమైన పరిమాణంలో ఉంటుందో వారు విధ్వంసానికి, “అవివేక యుక్తములును హానికరములైన అనేక దురాశ”సులువుగా పాల్పడ్డారు. (1తిమోతి 6:9) “దేవుని జతపనివారు” తమ ప్రభావాన్ని యధార్థ ఆశనిగ్రహ నియమాల వ్యాప్తిని ప్రోత్సహించటానికి వినియోగించాలి. CDTel 156.3
దేవునికి నమ్మకంగా నివసించటం ఎంతో విలువైన విషయం. తన సేవలో నిమగ్నమైన వారందరి విషయంలో ఆయనకు హక్కులున్నాయి. మనసు శరీరం ఉత్తమ ఆరోగ్యస్థితిలో ఉండాలని ప్రతీ శక్తి ప్రతీ దైవ వరం తన నియంత్రణ కింద ఉండాలని, అవి ఖచ్చితమైన మితానుభవ అలవాట్లు తీర్చి దిద్దగలిగినంత బలంగాను అప్రమత్తంగాను ఉండాలని ఆయన కోరుతున్నాడు. మన శరీరం మన ఆత్మ మన శక్తులన్నీ తన సేవకు వినియోగించేందుకు ఆయన మనకు అప్పగించిన వరాలుగా మనం అభినందించి, మనల్ని మనం ఆయనకు అంకితం చేసుకోటం మన విధి. CDTel 156.4
ఈ కృపకాలావధిలో మన సర్వశక్తుల్ని సామర్థ్యాల్ని సర్వదా బలోపేతం చేసుకుని అభివృద్ధి పర్చుకోవాలి. ఈ నియమాల్ని అభినందించి, తమ శరీరాల్ని జ్ఞానయుక్తంగాను దైవ భీతితోను సంరక్షించుకోటానికి శిక్షణ పొందినవారు మాత్రమే ఈ సేవలో బాధ్యతలకు ఎంపిక చెయ్యబడాలి. సత్యంలో సుదీర్ఘకాలం ఉన్నప్పటికీ నీతి నిబంధనలకి అనీతి నిబంధనలకు తేడా తెలియనివారిని దేవుని న్యాయాన్ని గురించి కృపను గురించి ఎవరి అవగాహన మసకబారిందో వారిని బాధ్యతల నుంచి తొలగించాలి. ప్రతీ సంఘానికి నిర్దిష్టమైన బూరధ్వనితో స్పష్టమైన సాక్ష్యం అవసరం. CDTel 157.1
ఆశా నిగ్రహం పై మన ప్రజల్ని నైతికంగా చైతన్యపర్చగలిగితే గొప్ప విజయం సాధించవచ్చు. ఈ జీవితానికి సంబంధించిన అన్ని విషయాల్లోను మితానుభవాన్ని బోధించి ఆచరణలో పెట్టాలి. తినటంలో తాగటంలో నిద్రపోటంలో బట్టలు ధరించటంలో మితానుభవం మత జీవితానికి సంబంధించిన మంచి నియమాల్లో ఒకటి. ఆత్మ మందిరంలో ప్రవేశించిన సత్యం శరీర చికిత్సలో మార్గనిర్దేశం చేస్తుంది. మానవారోగ్యానికి సంబంధించిన ఏ విషయాన్ని నిర్లక్ష్యం చెయ్యకూడదు. ఈ జీవితంలో మన సమయాన్ని, శక్తినీ, ప్రభావాన్ని మనం ఉపయోగించటంపై మన నిత్యజీవిత శ్రేయస్సు ఆధారపడి ఉంటుంది. CDTel 157.2