(1864) Sp. Gifts IV, 129 - 131 CDTel 157.3
245. సత్యాన్ని విశ్వసిస్తున్నట్లు చెప్పుకునే ఓ తరగతి ప్రజలున్నారు. వారు పొగాకు, ముక్కుపొడి, టీ, కాఫీ వాడరు. అయినా వారు వేరే రకంగా ఆహార వాంఛను తృప్తిపర్చుకుంటున్నారు. వారు నూనెలో వేపిన మాంసం కొవ్వుతో నిండిన గ్రేవీలు వాంఛిస్తారు. వారి అభిరుచి ఎంత వక్రమైందంటే అతి హానికరమైన రీతిగా తయారుచేస్తే తప్ప మాంసం సయితం వారికి తృప్తినివ్వదు. కడుపు వేడెక్కుతుంది. జీర్ణక్రియ ఇంద్రియాలికి పని ఎక్కువవుతుంది. అయినా దానిమీద అదనంగా పడ్డ భారాన్ని పరిష్కరించటానికి కడుపు కష్టపడి పనిచేస్తుంది. తన పనిని పూర్తిచేసిన తర్వాత కడుపు తీవ్రంగా అలసి పోతుంది. వలితంగా అది బలహీనమౌతుంది. ఇక్కడే పెక్కుమంది మోసపోతారు. అది ఆకలి ఉత్పత్తి చేసే భావన అని అపోహపడి, కడుపు విశ్రాంతి పొందటానికి సమయమివ్వకుండా మరింత ఆహారం తీసుకుంటారు. అది అప్పటికి ఆ బలహీనతా భావాన్ని తీసివేస్తుంది. ఎంత ఎక్కువ తింటే, అంత ఎక్కువ కావాలని అది గోల పెడుంది. ఈ బలహీనత సాధారణంగా మాంసాహారం, ఎక్కువ సార్లు తినటం, ఎక్కువ పరిమాణంలో తినటం పర్యవసానం.... CDTel 157.4
అది ఫ్యాషన్ కాబట్టి అనారోగ్యకర ఆహారవాంఛకు అనుగుణంగా ఐసింగుతో కేకులు, పైలు, ఫుడ్డింగ్లు, ప్రతీ విధమైన హానికర ఆహార పదార్థాలతో కడుపును నింపటం జరుగుతుంది. భోజన బల్లమీద రకరకాల వంటకాలుండాలి. లేకపోతే వాంఛ తీరదు. ఈ తిండి బానిసలకు ఉదయాన స్వచ్చమైన శ్వాస ఉండదు. వారి నాలుక పాచితో తెల్లగా ఉంటుంది. వారికి ఆరోగ్యముండదు. నొప్పులు, తలనొప్పుల వంటి రకరకాల బాధలు ఎందుకు వస్తున్నాయా అని వారు ఆశ్చర్యపడుతుంటారు. అనేకులు మూడు పూట్లా తిని పడుకోకముందు మరోసారి తింటారు. కొద్దికాలంలోనే జీర్ణమండల అవయవాలు దెబ్బతింటాయి. ఎందుకంటే వాటికి అవసరమైన విశ్రాంతి సమయం ఉండదు. ఇలాంటి వారు తీవ్ర అజీర్తి వ్యాధికి గురిఅవుతారు. ఆ వ్యాధి తమకెందుకు వచ్చిందా అని ఆలోచించటం మొదలు పెడ్తారు. కారణం దాని తప్పనిసరి ఫలితాన్ని తెస్తుంది. ముందు తిన్న భోజనాన్ని జీర్ణించుకోటానికి కావలసిన శ్రమనుంచి విశ్రమించటానికి కడుపుకి సమయం ఇవ్వకుండా రెండో భోజనం తీసుకోకూడదు. మూడో భోజనమంటూ చేస్తే అది చాలా తక్కువగా ఉండాలి. అది కూడా పడుకోటానికి కొన్ని గంటలు ముందు చెయ్యాలి. CDTel 158.1
అనేకులు అమితానికి ఎంతగా బానిసలవుతారంటే వారు ఎట్టి పరిస్థితిలోనూ తమ తిండిబోతు అలవాటును మార్చుకోలేరు. ఆరోగ్యాన్ని పాడుచేసికోటానికైనా అకాల మరణానికైనా ఇష్టపడతారుగాని అమిత తిండిని నియంత్రించటానికి ఇష్టపడరు. ఇకపోతే తమ అన్నపానాలికీ ఆరోగ్యానికి మధ్య గల సంబంధం గురించి తెలియనివారు చాలామంది ఉన్నారు. తిండి విషయంలో అలాంటి వారిని చైతన్యపర్చితే తిండి వాంఛను వారు ఉపేక్షించటానికి నైతిక ధైర్యం కలిగి ఎక్కువ మితంగా ఆరోగ్యవంతంగా తినవచ్చు. తాము చేపట్టే ఈ చర్యవల్ల ఎంతో శ్రమను బాధను వారు తప్పించుకోవచ్చు. CDTel 158.2