ఉత్తరం 145, 1901 CDTel 180.1
277. ఆహారం విషయంలో ఒత్తిడికి తావు లేకుండా జ్ఞాన వివేకాలతో వ్యవహరించాలి. మూడు పూటలు తినటం కన్నా రెండుపూటలే తినటం ఆరోగ్యానికి మంచిదని చూపించాలి. అయితే ఇందులో ఎలాంటి ఒత్తిడి ఉండకూడదు. ఆసుపత్రిలో పనిచేసేవారెవ్వరినీ రెండుపూటల భోజన పద్ధతిని అవలంబించాలని ఒత్తిడి చెయ్యకూడదు. ఒత్తిడి చెయ్యటం కన్నా ఒప్పించటం సముచితం.... CDTel 180.2
అమెరికాలో) వెలుగుండే సమయం తగ్గే దినాలు వచ్చాయి. ఈ విషయాన్ని సమర్పించటానికి ఇదే మంచి సమయం. వెలుగుండే గడియలు తగ్గే కొద్దీ రాత్రి భోజనం కొంచెం ఆలస్యంగా తీసుకోవాలి. అప్పుడు మూడోభోజనం అవసరం ఉండదు. CDTel 180.3
ఉత్తరం 200, 1902 CDTel 180.4
278. మూడోపూట భోజనం విషయంలో రెండు పూటల భోజనాన్ని నిర్బంధం చెయ్యవద్దు. కొందరు మూడుపూటలు మితంగా తిని ఆరోగ్యంగా ఉండవచ్చు. వారిని రెండుపూటల భోజనానికి పరిమితం చేసినప్పుడు, ఆ మార్పుని వారు తట్టుకోలేరు. CDTel 180.5
[మన ఆసుపత్రుల్లో మూడోపూట భోజనం లేకుండా చేయటం ద్వారా హాని కలిగే అవకాశం-424] CDTel 180.6