ఉత్తరం 141, 1899 CDTel 181.3
280. ఆహార సమస్యపై తీవ్రవాదానికి దిగుతున్నారన్న అభిప్రాయం అనేకులకున్నది. ఈ విద్యాలయంలో (అవండేల్) జరుగుతున్నట్లు, విద్యార్థులు మానసిక శ్రమ శారీరక శ్రమ చేస్తున్నప్పుడు, మూడోపూట భోజనానికి అభ్యంతరం చాలా మట్టుకు తొలగిపోతుంది. అప్పుడు తాము దుర్వినియోగానికి గురి అవుతున్నట్లు ఎవరూ భావించాల్సిన అవసరం ఉండదు. రెండు పూటలే తినే వారు ఇందులో ఎలాంటి మార్పూ చేసుకోనవసరం లేదు..... CDTel 181.4
కొంతమంది ఉపాధ్యాయులు విద్యార్థులు తమ గదుల్లో తినే విశేషావకాశం కలిగి ఉండటం ఆరోగ్యవంతమైన ప్రభావం చూపించటం లేదు. భోజనం చెయ్యటం విషయంలో సమైక్య చర్య అవసరం. దినంలో రెండు సార్లు మాత్రమే భోజనం చేసేవారు రెండోపూట భోజనాన్ని మూడోపూటకు సరిపోయేలాగా తినాలన్న అభిప్రాయంతో ఉండేవారు తమ జీర్ణక్రియావయవాలకి హానికలిగిస్తారు. విద్యార్థుల్ని మూడోపూట తిననివ్వండి. అది కూరగాయలు లేకుండా సామాన్యంగా తయారు చేసిన పండ్లు రొట్టెతో కూడిన ఆహారమై ఉండాలి. CDTel 181.5
[వాక్య సేవకులకు రెండుపూటల భోజనం శారీరక, ఆధ్యాత్మిక ఆరోగ్యానికి మేలు చేస్తుంది-227] CDTel 181.6
[ఇ.జి.వైట్ రెండు పూటల భోజన ప్రణాళికను అనుసరించింది -అనుబంధం1:4,5,20,22,23] CDTel 182.1
[శ్రీమతి వైట్ భోజన ఏర్పాటు రోజుకు రెండుసార్లు-27] CDTel 182.2