(1869) 2T 254 CDTel 204.3
322. గృహానికి సౌకర్యంగా ఉండే వస్తువులు కోరటానికి నీ భార్యని ఆహంకారం నడిపించిందని నీవు పొరపాటుగా తలంచావు. సరిపడా ఆహారం ఇవ్వకుండా ఆమె పట్ల నీవు కఠినంగా వ్యవహరిస్తున్నావు. ఆమెకు మరింత ఉదార ఆహార సరఫరా అవసరం. భోజన బల్లమీద ఆహారం మరింత సమృద్ధిగా ఉండాలి. గృహంలో సౌకర్యాన్ని వసతిని సమకూర్చి తన పనిని సులభతరం చేసే సామగ్రి ఆమెకు అవసరం. కాని నీవు తప్పు దృక్కోణం నుంచి విషయాల్ని చూస్తున్నావు. మనం ఏది తిని బలం పొందగలమో అది సరిపోతుందన్నది నీ ఆలోచన. బలహీనంగా ఉన్న నీ భార్యకు మితాహారం అవసరమని నీవు వాదించావు. నీవు ఏ ఆహారం తిని బలంగా ఉండగలుగుతున్నావో ఆ ఆహారం ఆమెకు మంచి రక్తాన్ని లేదా కండరాన్ని ఉత్పత్తి చెయ్యలేదు. ఇతరులు తిని బలంగా ఉండగలిగే ఆహారాన్ని - అది ఒకే విధంగా తయారు చెయ్యబడ్డప్పటికీ - కొందరు తీసుకోలేరు. CDTel 204.4
నీవు తీవ్రవాదివయ్యే ప్రమాదంలో ఉన్నావు. నీ శరీర వ్యవస్థ ముతక, నాసి రకపు ఆహారాన్ని మంచి రక్తంగా మార్చగలుగుతుంది. నీలో రక్తాన్ని తయారుచేసే అవయవాలు ఆరోగ్యంగా ఉన్నాయి. అయితే నీ భార్యకు ప్రత్యేక ఆహారం అవసరం. నీ వ్యవస్థ మంచి రక్తంగా మార్చుతున్న ఆహారాన్ని ఆమెకిస్తే ఆమె శరీరవ్యవస్థ దాన్ని పరిష్కరించలేదు. ఆమెకు జీవశక్తి లోపించింది. ఆమెకు బలవర్ధకాహారం ఉదారంగా ఇవ్వాలి. ఆమెకు ఎక్కువ పండ్లు ఇవ్వటం అవసరం. ఆమె రోజూ వాటికే పరిమితం కాకూడదు. ఆమె ప్రాణాపాయ స్థితిలో ఉన్నది. ఆమె వ్యాధి బాధితురాలు. ఆమె శరీర వ్యవస్థ అవసరాలు ఆరోగ్యవంతుల అవసరాలకన్నా చాలా భిన్నమైనవి. CDTel 204.5