(1859) 1T 205, 206 CDTel 205.1
323. బలవర్ధకాహారాన్ని తీసుకోకపోటం ద్వారా మీ శరీరాల్ని బాధ పెట్టటం విషయంలో మీకు తప్పు అభిప్రాయాలున్నాయని నాకు దర్శనంలో చూపించటం జరిగింది. దేవుడు మీతో ఉన్నాడని లేకపోతే మిమ్మల్ని మీరు ఉపేక్షించుకుని ఈ రకంగా త్యాగం చెయ్యరని కొందరు సంఘసభ్యులు తలంచటానికి ఈ విషయాలు నడిపిస్తాయి. కాని ఇవేవీ మిమ్మల్ని ఎక్కువ పరిశుద్ధుల్ని చెయ్యవని నేను చూశాను. అన్యులు ఇవన్నీ చేస్తారుగాని దానికి ప్రతిఫలం పొందరు. విరిగినలిగిన స్వభావం దేవుని దృష్టిలో గొప్ప విలువైనది. ఈ విషయాల గురించి మీ అభిప్రాయాలు తప్పు అభిప్రాయాలని, మీ సొంత ఆత్మ ఆసక్తి విషయంలో శ్రద్ధ తీసుకోవలసినప్పుడు మీరు చిన్న చిన్న విషయాల్లో సంఘం పై నిఘావేస్తున్నారని చూశాను. తన మంద తాలూకు బాధ్యతని దేవుడు మీమీద పెట్టలేదు. మీరు చూసేలా వారు చూడలేక పోతున్నారు గనుక, అనుసరించటం అవసరమని మీరు భావించే కఠిన విధానాన్ని వారు అనుసరించటం లేదు గనుక సంఘం నేపథ్యంలో ఉంటున్నదని మీరు తలస్తున్నారు. మీ విధి విషయంలో ఇతరుల విధి విషయంలో మీరు మోసపోతున్నారని నేను చూశాను. కొందరు ఆహారం విషయంలో తీవ్రంగా వ్యవహరిస్తున్నారు. వారు తీవ్ర విధానాల్ని అనుసరించి అతి సామాన్య జీవనం అనుసరించి ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నారు. వారి శరీరాల్లోకి వ్యాధి ప్రవేశించింది. దేవుని మందిరం బలహీనమయ్యింది... CDTel 205.2
అంత కఠిన మార్గాన్ని అవలబించి ఎవరూ దేవుని ఆలయమైన శరీరాన్ని బలహీన పర్చాలని లేదా దానికి హాని కలిగించాలని దేవుడు కోరటం లేదని దర్శనంతో చూశాను. సంఘం దీనస్వభావం కలిగి తమ ఆత్మల్ని దుఃఖపర్చుకోటానికి వాక్యంలో విధులు ధర్మాలు ఉన్నాయి. దీనత్వాన్ని విధేయతను కనపర్చటానికి సిలువల్ని తయారు చేసుకోటం, శరీరానికి బాధ కలిగించే విధుల్ని రూపొందించుకోటం అవసరం లేదు. ఇదంతా దైవ వాక్యం చెబుతున్నది కాదు. CDTel 206.1
శ్రమ కాలం ముందున్నది. అప్పుడు దైవ ప్రజలు తమను తాము ఉపేక్షించుకోటం, ప్రాణం కాపాడుకోటానికి సరిపడ్డంత మాత్రమే భుజించట అవసరమౌతుంది. అయితే దేవుడు మనల్ని ఆ సమయానికి సిద్ధం చేస్తాడు. ఆ భయంకర ఘడియలో దేవుడు మనకు తన శక్తిని సమకూర్చటానికి, తన ప్రజల్ని సంరక్షించటానికి మన అవసరం ఆయనకి తరణాన్నిస్తుంది...... CDTel 206.2
చేతులతో శ్రమ చేసేవారు ఆ శ్రమకు అవసరమైన పోషకాహారాన్ని తమ శరీరానికి సమకూర్చాలి. వాక్యం, సిద్ధాంతపరంగా శ్రమ చేసేవారు కూడా తమ శక్తిని పోషించుకోవాలి. ఎందుకంటే సాతాను, అతడి దుష్ట దూతలు వారి శక్తిని నాశనం చెయ్యటానికి పోరాటం సల్పుతున్నారు. ఆయాసకరమైన శారీరక శ్రమ నుంచి శరీరానికి విశ్రాంతి నిచ్చి, తమ శక్తిని పెంచుకోటానికి పోషకాహారాన్ని సరఫరా చెయ్యగలిగినప్పుడు సరఫరా చెయ్యాలి. ఎందుకంటే వారు తమకున్న శక్తి అంతటిని వినియోగించటం అగత్యమౌతుంది. దైవ ప్రజలెవరూ తమకు తాము శ్రమ కాలాన్ని సృష్టించుకోటం దేవున్ని మహిమ పర్చదని నేను దర్శనంలో చూశాను. దైవ ప్రజల ముందు శ్రమకాలం ఉంది. ఆ భయంకర సంఘర్షణకు వారిని ఆయన సన్నద్ధం చేస్తాడు. CDTel 206.3