(1867) 2T 538 326. ఆరోగ్య సంస్కర్తలు అతిగా పోకుండా జాగ్రత్త పడాలి. దేహానికి చాలినంత పోషక పదార్థం లభించాలి. కేవలం గాలి పీల్చుకుని బతకలేం. బలవర్ధకాహారం లేకుండానూ ఆరోగ్యం కాపాడుకోలేం. భోజనం కమ్మగా ఉండేందుకు దాన్ని చక్కగా శ్రద్ధగా తయారు చెయ్యాలి. CDTel 212.2
(1909) 9T 161-163 CDTel 212.3
327. సరియైన పోషక పదార్థాలు లేని ఆహారం ఆరోగ్య సంస్కరణకు చెడ్డ పేరు తెస్తుంది. మనం మర్త్యులం కనుక శరీరానికి సరియైన పోషణనిచ్చే ఆహారాన్ని భుజించాలి. CDTel 212.4
మన ప్రజల్లో కొందరు అనుచిత ఆహారం తినకుండా ఉండటంలో అతి జాగ్రత్తగా ఉంటూనే శరీర పోషణకు అవసరమైన పోషకాల్ని సరఫరా చెయ్యటం నిర్లక్ష్యం చేస్తారు. ఆరోగ్య సంస్కరణ అతివాదులు రుచిలేని, చప్పని, తృప్తి నివ్వని వంటకాలు తయారుచేసే ప్రమాదమున్నది. ఆహారాన్ని రుచిగా ఉండేటట్టు, పోషణనిచ్చేటట్టు తయారు చెయ్యాలి. శరీరానికి అవసరమైన దాన్ని అది దోచుకో కూడదు. నేను ఉప్పు ఎప్పుడూ ఉపయోగిస్తాను. హాని కలిగించే బదులు అది రక్తానికి అత్యవసరం. కొంచెం పాలు లేక మీగడ ఉపయోగించటం ద్వారా కూరగాయల్ని రుచికరంగా తయారు చెయ్యాలి. CDTel 212.5
బటర్, గుడ్లని స్వేచ్ఛగా వాడటం వల్ల చిన్నపిల్లలకి వ్యాధులు సంభవించే ప్రమాదం గురించి హెచ్చరికలు ఉన్నప్పటికీ సరియైన పోషణనిచ్చి, జాగ్రత్తగా పెంచిన కోడి పెట్టల గుడ్లు ఉపయోగించటాన్ని నియమ ఉల్లంఘనగా పరిగణించకూడదు. కొన్ని విషాలకి విరుగుడుగా పనిచేసే ఔషధ పదార్ధాలు గుడ్లలో ఉన్నాయి. CDTel 213.1
పాలు, గుడ్లు, బటర్ వాడక పోటం వల్ల మన ప్రజల్లో కొందరు తమ శరీరాలకి సరియైన పౌష్టికతను సరఫరా చెయ్యటం లేదు. ఫలితంగా వారు దుర్బలులై పనిచెయ్యలేకపోతున్నారు. ఆరోగ్య సంస్కరణకు ఇలా చెడ్డ పేరు వస్తున్నది. పటిష్ఠంగా నిర్మించటానికి మేము ప్రయత్నిస్తున్న పనిని దేవుడు కోరని అన్య విషయాలతో అస్తవ్యస్తం చెయ్యటం జరుగుతున్నది. సంఘం శక్తి సామర్థ్యాలు కుంటుపడుతున్నాయి. అయితే ఈ తీవ్ర అభిప్రాయాల దుష్ఫలితాల్ని నివారించటానికి దేవుడు కలుగజేసు కుంటాడు. పావ మానవుల నడుమ సువార్త సామరస్యాన్ని పెంపొందించవలసి ఉంది. ధనవంతుల్ని పేదవారిని క్రీస్తు పాదాల చెంతకు తేవాల్సి ఉంది. CDTel 213.2
ఇప్పుడు మనం ఉపయోగిస్తున్న పాలు, , మీగడ, గుడ్లు వంటి కొన్ని ఆహార పదార్థాల్ని విసర్జించాల్సిన సమయం వస్తుంది. అయితే తీవ్ర నిర్బంధాల్ని ముందే విధించుకోటం ద్వారా మన మీదకి ఆందోళనను తెచ్చుకోనవసరం లేదు. ఆ పరిస్థితులు చోటు చేసుకునే వరకు వేచి ఉండండి. ప్రభువు దానికి మార్గం సిద్ధం చేస్తాడు. CDTel 213.3
ఆరోగ్య సంస్కరణ నియమాల్ని విజయవంతంగా ప్రచురించగోరే వారు దైవ వాక్యాన్ని తమ మార్గదర్శిగాను సలహాదారుగాను చేసుకోవాలి. ఆరోగ్య సంస్కరణ నియమాన్ని బోధించే వారు ఇది చేసినప్పుడే విజయవంతులవుతారు. మనం విసర్జించే ఆహార పదార్థాల స్థానంలో ఆరోగ్యమైన, రుచికరమైన ఆహార పదార్థాల్ని తినక పోటం ద్వారా ఆరోగ్య సంస్కరణకు వ్యతిరేకంగా సాక్ష్యం ఎన్నడూ ఇవ్వకుందుము గాక. ప్రేరేపకాలకి ఆకలి పుట్టించే పదార్థాల్ని ఏరకంగాను ప్రోత్సహించకండి. సామాన్యమైన, ఆరోగ్యవంతమైన ఆహారాన్నే తీసుకుని ఆరోగ్య సంస్కరణ నియమాల నిమిత్తం ఎల్లప్పుడు కృతజ్ఞులై ఉండండి. అన్ని విషయాల్లో నిజాయితీగా నీతిగా ఉండండి. విలువైన విషయాలు లభిస్తాయి. CDTel 213.4