ఉత్తరం 37, 1901 CDTel 206.4
324. ఆరోగ్య సంస్కరణ విషయంలో తీవ్ర భావజాలం గురించి నేను చెప్పాల్సింది కొంత ఉంది. కఠోరంగా తీవ్రంగా ఆచరించినప్పుడు ఆరోగ్య సంస్కరణ ఆరోగ్య వైకల్యమౌతుంది. రోగులకి చికిత్స చేయాల్సిన ఆసుపత్రులు ఆరోగ్య కేంద్రాల్లోని రోగులకి మీరు మీకు, మీ భార్యకు ఏ ఆహారం నిర్దేశిస్తారో దాన్నే ఇవ్వటం కుదరదు. రోగుల ఆహారం విషయంలో మీ అభిప్రాయాలు మంచివి కావు. చేసిన మార్పు చాలా పెద్దది. మాంసాహారం హానికరమని ఒప్పుకోవలసి ఉన్నా అంతకన్నా తక్కువ అభ్యంతరకరమైన గుడ్ల వాడకం పరిగణించాలి. పాలు తాగటాన్ని గాని వంటలో వాడటాన్ని గాని నిషేధించకండి. ఆరోగ్యంగా ఉన్న ఆవుల పాలు సేకరించి కాచి వాడాలి. CDTel 206.5
ఆరోగ్య సంస్కరణ సంబంధంగా తీవ్రభావాలు కలవారు రుచిలేని ఆహారం తయారు చేసే ప్రమాదంలో ఉంటారు. ఇది పదే పదే జరుగుతున్న పని. ఆహారం రుచిగా లేనందువల్ల కడుపు దాన్ని నిరాకరిస్తుంది. రోగులకిచ్చే ఆహారం పలురకాలుగా ఉండాలి. ఎప్పుడూ ఒకేలాంటి వంటకాల్ని వారికి వడ్డించకూడదు...... CDTel 207.1
నాకు దేవుడిచ్చిన విషయం నీకు చెబుతున్నాను. ఎందుకంటే నీవు పోషక పదార్థాలు లేని ఆహారం తీసుకుంటున్నట్లు నాకు వెలుగు వచ్చింది. ఆహారం విషయంలో నీవు విద్యార్థులుకి బోధిస్తున్న విషయం బోధించటం నీకు మంచిది కాదని నేను నీకు చెప్పాలి. ఎందుకంటే విసర్జించాల్సిందంటూ నీవు బోధిస్తున్న కొన్ని ఆహార పదార్థాలు సహాయం ఎవరికి అవసరమో వారికి సహాయం అందించవు. CDTel 207.2
సోదర, సోదరి — మీ పై నాకు గొప్ప నమ్మకముంది. మీరు సంపూర్న ఆధ్యాత్మికత కలిగివుండేందుకు మీకు శారీరకారోగ్యం ఉండాలని అభిలషిస్తున్నాను. మీరు అంత బాధకు గురి అవ్వటానికి కారణం మీరు సరిఅయిన ఆహారం తినలేకపోటమే. బలహీనంగాను సున్నితంగాను ఉన్న మీ శరీరానికి కావలసిన పోషకాహారాన్ని మీరు తీసుకోటం లేదు. మంచి, ఆరోగ్యవంతమైన ఆహారాన్ని మీరు ఉ పేక్షించకూడదు. CDTel 207.3
ఒకప్పుడు డా|| — తాననుకున్న పంథాలో ఆరోగ్యసంస్కరణకు అనుగుణంగా వంటచెయ్యటం మా కుటుంబానికి నేర్పటానికి ప్రయత్నించాడు. భోజనాన్ని పోపు పెట్టటానికి ఉప్పు మొదలైన వేమీ లేకుండా వండటం నేర్పించాడు. అలా వంటచెయ్యటం ప్రయత్నించాలని తీర్మానించుకున్నాను. కాని చాలా బలహీనపడి క్షీణించిపోయాను. ఆ పద్ధతిని మార్చుకోవలసి వచ్చింది. నేను మరో విధానాన్ని అవలబించాను - జయప్రదంగా. ఇది మీకు ఎందుకు చెబుతున్నానంటే మీరు ప్రమాదంలో ఉన్నట్లు నేను గుర్తిస్తున్నాను. పౌష్టికత సమకూర్చే విధంగా ఆహారాన్ని తయారుచెయ్యాలి. శరీర వ్యవస్థకు అవసరమైన దాన్ని అది దోచుకోకూడదు. CDTel 207.4
సోదరుడు, సోదరీ — ని క్రమంగా విశ్రాంతి తీసుకోవల్సిందిగా ప్రభువు పిలుపునిస్తున్నాడు: మీరు గతకాలంలో చేపట్టినట్లు ఇప్పుడు భారాలు చేపట్టటం మంచిది కాదు. మీరు జాగ్రత్త తీసుకుంటే తప్ప ఆయన దృష్టిలో ప్రశస్తమైన మీ ప్రాణాన్ని పోగొట్టుకుంటారు. “మీరు మీ సొత్తు కారు. విలువ పెట్టి కొనబడినవారు కనుక మీ దేహముతో దేవుని మహిమ పరచుడి....... CDTel 208.1
ఆరోగ్య సంస్కరణ విషయంలో తీవ్ర వైఖరి అవలంబించకండి. మన ప్రజలు కొందరు ఆరోగ్య సంస్కరణ పట్ల చాలా అజాగ్రత్తగా ఉంటున్నారు. కాని కొందరు వెనకబడి ఉన్నారు గనుక వారికి ఆదర్శంగా ఉండేందుకు మీరు తీవ్రవాదులు కాకడదు. మంచి రక్తం తయారు చేసే ఆ ఆహారాన్ని మీరు ఉపేక్షించకూడదు. యధార్ధ నియమాల ఆచరణ, ఆరోగ్య సంస్కరణ సిఫారసు చెయ్యని అనుభూతినిచ్చే ఆహారానికి సమర్పించుకోటానికి మిమ్మల్ని నడిపిస్తుంది. ఇదే మీకున్న ప్రమాదం. శారీరకంగా బలహీన పడుతున్నట్లు గమనించినప్పుడు, మీరు మార్పులు చేసుకోటం చాలా ముఖ్యం. వాటిని వెంటనే చేసుకోటం అవసరం. మీరు విడిచి పెట్టిందేదైనా ఉంటే దాన్ని మీ ఆహారంలో చేర్చుకోండి. ఇది చెయ్యటం మీ విధి, ఆరోగ్యంగా ఉన్న కోళ్ల గుడ్లనే ఉపయోగించండి. వీటిని వండుకుని గాని పచ్చిగా గాని తినవచ్చు. వాటిని పగలగొట్టి పులియని ద్రాక్ష రసంలో వేసుకుని తాగవచ్చు. ఇది మీ శరీర వ్యవస్థకు అవసరమైన పదార్థాల్ని సరఫరా చేస్తుంది. ఇది చెయ్యటం సరికాదని భావించకండి..... CDTel 208.2
వైద్యుడిగా నీ అనుభవాన్ని అభినందిస్తున్నాం. అయినా నీ ఆహారంలో పాలు గుడ్లు ఉపయోగించాలి. ప్రస్తుతం వీటిని విసర్జించకూడదు. వాటిని విసర్జించాలన్న సిద్ధాంతాన్ని బోధించకూడదు. CDTel 208.3
ఆరోగ్య సంస్కరణను గూర్చిన నీ అభిప్రాయం పౌష్టికత నివ్వని ఆహార నియమాన్ని నీవు అనుసరించటం, చాలా విప్లవాత్మకం.... CDTel 209.1
నేను నీకు చెప్పిన మాటలు నీవు వింటావని ఆశిస్తున్నాను. కొన్ని విషయాల్లో, నీ విషయంలోను ఇతరుల విషయంలోను, నీవు మరెక్కువ ఉదారంగా ఉండకపోతే ఆరోగ్య సంస్కరణకు అనుకూల ప్రభావాన్ని చూపటం లేదని నాకు తెలియపర్చటం జరిగింది. పాలను ఇప్పటిలా స్వేచ్చగా ఉపయోగించుకోలేని సమయం వస్తున్నది. కాని ప్రస్తుత సమయం పాల వినియోగం మానాల్సిన సమయం కాదు. విషాలకు విరుగుడుగా పనిచేసే కొన్ని పదార్థాలు గుడ్లలో ఉన్నాయి. పిల్లలకి అవి ఓ వ్యసనంగా మారి వాటిని దుర్వినియోగం చేస్తున్న కుటుంబాల్లో వాటి వినయోగానికి వ్యతిరేకంగా హెచ్చరిక ఇవ్వటం జరుగుతుంది. అయినా సరిగా పెంచిన, ఆరోగ్యవంతమైన పెట్టల గుడ్ల వాడకం నియమాన్ని అతిక్రమించటంగా పరిగణించకూడదు..... CDTel 209.2
క్రీస్తు ఎవరి నిమిత్తం మరణించాడో వారు తమను తాము సరిగా సంరక్షించుకుని ఇతరులకు మంచి ఆదర్శంగా నివసించాలని దేవుడు పిలుపునిస్తున్నాడు. సోదరుడా, ఆహారం విషయంలో దేవుని ప్రజలకు నీవు ఓ పరీక్ష పెట్టకూడదు. ఎందుకంటే ఎక్కువగా విస్తరణ పొందే బోధనల్లో వారి నమ్మకం నశిస్తుంది. ఆరోగ్య సంస్కరణ ప్రతీ విషయంలో తన ప్రజలు మంచి జ్ఞానం కలిగి ఉండాలని ప్రభువు కోరుతున్నాడు. అయితే మనం హద్దు మీరి వ్యవహరించకూడదు.... CDTel 209.3
డా|| — అనారోగ్యానికి కారణం అతడు తన ఆరోగ్య బ్యాంక్ ఖాతా నుంచి ఎక్కువ తీసుకుని, తీసుకున్న అధిక ద్రవ్యాన్ని ఆరోగ్యవంతం, పౌష్టికం, రుచికరం అయిన ఆహారం రూపంలో తిరిగి చెల్లించలేకపోవటం. సోదరుడా, నీ నిమిత్తం సిలువ మరణం పొందిన ఆయనకు నీ జీవితాన్ని అంకితం చేసుకో. కాని చాలీచాలని ఆహారానికి కట్టుబడి ఉండకు. ఎందుకంటే అలా చెయ్యటం ద్వారా నీవు ఆరోగ్య సంస్కరణకు అపార్థం సూచిస్తావు. CDTel 209.4
తిండిబోతు తనానికి అమితానుభవానికి వ్యతిరేకంగా పని చేస్తున్నప్పుడు, స్వస్తబుద్ధి గలవారిని ఆకట్టుకునే సువార్త సత్యసాధనాలు, పరికరాల్ని పరిగణలోకి తీసుకోవాలి. మన సేవను తిన్ననైన, సామాన్యమైన మార్గాల్లో చెయ్యటానికి, మానవ కుటుంబం ఏ పరిస్థితులకి గురి అయ్యిందో వాటిని మనం గుర్తించాలి. లోకంలోని వివిధ దేశాల్లో నివసించే ప్రజల నిమిత్తం దేవుడు ఏర్పాట్లు చేశాడు. దేవుని జత పనివారవ్వాలని ఆశించే వారు తాము దేవుని ద్రాక్షతోటలో ఆరోగ్య సంస్కరణను ఎలా ప్రబోధిస్తున్నారో జాగ్రత్తగా పరిగణించాలి. ఏ ఆహారం తినాలో ఏ ఆహారం తినకూడదో కరాఖండిగా చెప్పటంలో వారు ఆచి తూచి అడుగులు వెయ్యాలి. దేవుడు రక్షించే ప్రజలకి కృపా వర్తమానాన్ని అందించటంలో మానవ దూత దైవ సహాయకునితో ఏకమవ్వాలి. CDTel 210.1
మనం సామాన్య ప్రజలతో సంబంధాలు కలిగి ఉండాలి. వారికి ఆరోగ్య సంస్కరణని కఠిన రూపంలో బోధిస్తే హాని కలుగుతుంది. మాంసాహారం గురించి టీ, కాఫీల గురించి ప్రస్తావించ వద్దని మా సూచన. ఇది మంచిది. కాని కొందరు పాలవాడకం కూడా మానాలంటారు. దీని విషయంలో అతి జాగ్రత్తగా వ్యవహరించాలి. కొన్ని బీద కుటుంబాల ఆహారం బ్రెడ్డు, పాలు, మా ఉంటే ఓ పండు మాత్రమే. మాంసాహారాన్ని మార్తిగా విడిచి పెట్టాలి, కానీ కూరగాయల్ని రుచికరంగా తయారుచెయ్యటానికి కొంచెం పాలో, మీగడో అలాంటిది మరేదైనానో ఉండాలి. తమకు ఆరోగ్య సంస్కరణను సమర్పించినప్పుడు, “మే మేమి తినాలి? గింజ పప్పులతో కూడిన ఆహారం మేము కొనుక్కోలేం” అని బీదలు అడుతారు. బీదలకి సువార్త బోధించేటప్పుడు తమకు ఏది బలవర్ధకాహారమో దాన్ని భుజించమని వారికి బోధించాల్సిందిగా ఉపదేశం పొందుతాను. గుడ్లు తినకూడదు, పాలు, మీగడ, వెన్న ఉపయోగించి ఆహారం తయారు చేసుకోకూడదు అని వారికి చెప్పలేను. వెన్న ఉపయోగించి ఆహారం తయారు చేసుకోకూడదు అని వారికి చెప్పలేను. బీదలకి సువార్త ప్రకటించాలి. కఠిన ఆహార నియమాల్ని అమలు జరపాల్సిన సమయం ఇంకా రాలేదు. CDTel 210.2
ఇప్పుడు మనం ఉపయోగిస్తున్న పాలు, మీగడ, గుడ్లు వంటి ఆహార పదార్థాల్ని విసర్జించాల్సిన సమయం వస్తుంది. కాగా నా వర్తమానం ఏంటంటే అది రాకముందే శ్రమకాలాన్ని మీ మీదకు తెచ్చుకుని అకాల మరణం కొనితెచ్చుకోవద్దని, ప్రభువు మీ మార్గాన్ని సిద్ధం చేసే వరకు వేచి ఉండండి అని. CDTel 211.1
తీవ్ర ఉద్రిక్తత రేగేంత వరకూ సాగదీసే సంస్కరణలు ఓ తరగతి ప్రజల్ని తృప్తి పర్చవచ్చు. విసర్జించబడ్డ వాటి స్థానంలో తమకు కావాల్సినవన్నీ వారికి లభించవచ్చు. కాని ఎవరికి ఈ పరీక్షలు అనవసరమో ఆ ప్రజల్లో ఈ తరగతి ప్రజలు అత్యల్ప హానికరమైనవిగా ప్రకటించిన వాటికి దూరంగా ఉండటానికి ప్రయత్నం చేసేవారు కొందరున్నారు. వారు తమ శరీరాలకు అవసరమైన పోషకాల్ని సరఫరా చెయ్యలేకపోతున్నారు. పర్యవసానంగా బలహీనులై పనిచెయ్యలేకపోతున్నారు. ఆరోగ్య సంస్కరణ ఇలా అభాసు పాలవుతున్నది. స్థిరంగా నిర్మించటానికి మేము ప్రయత్నిస్తున్న పనిని దేవుడు కోరని అన్య విషయాలతో అస్తవ్యస్తం చెయ్యటం జరుగుతున్నది. సంఘం శక్తి సామర్థ్యాలు కుంటుపడుతున్నాయి. CDTel 211.2
అయితే ఈ తీవ్ర అభిప్రాయాల దుష్ఫలితాల్ని నివరించటానికి దేవుడు కలుగజేసుకుంటాడు. పాప మానవుల నడుమ సువార్త సామరస్యాన్ని పెంపొందించాల్సి ఉంది. ధనవంతుల్ని పేదవారిని క్రీస్తు పాదాల చెంతకు తేవాల్సి ఉంది...... CDTel 211.3
పాలు, మీగడ, వెన్న, గుడ్లు వాడటం క్షేమం కాని సమయం వచ్చినప్పుడు దాన్ని దేవుడు బయలు పర్చుతాడు. ఆరోగ్య సంస్కరణ పేరుతో తీవ్ర చర్యల్ని ప్రబోధించకూడదు. పాలు, వెన్న, గుడ్ల వాడకం సమస్య దానికదే పరిష్కారమౌతుంది. ప్రస్తుతం ఇది సమస్య కాదు. మీ మితానుభవం అందరికీ వెల్లడికానివ్వండి. CDTel 211.4
ఉత్తరం 27, 1904 CDTel 211.5
325. గత రాత్రి నా నిద్రలో డా|| — తో మాట్లాడున్నాను. అతడితో ఇలా అన్నాను: ఆహారం సంబంధంగా తీవ్రధోరణి విషయంలో నీవింకా జాగ్రత్త వహించాలి. నీ సొంత ఆహారం విషయంలోనే కాదు, సహాయకులకి ఆసుపత్రి రోగులకి ఆహారం ఇవ్వటంలోను నీవు అతిగా వ్యవహరించకూడదు. రోగులు తమ భోజనానికి బాగా చెల్లిస్తారు. వారికి ధారాళంగా ఆహారం సరఫరా చెయ్యాలి. కొందరు కఠినంగా అదుపు చెయ్యాల్సిన ఆహార వాంఛగల స్థితిలోను అతిసామాన్యమైన ఆహారం ఇవ్వాల్సిన స్థితిలోను ఆసుపత్రికి వస్తారు. అయితే వారి ఆరోగ్యం మెరుగయ్యే కొద్దీ వారికి బలవర్ధకాహారం ఉదారంగా ఇవ్వాలి. CDTel 211.6
[ఆసుపత్రులు ఆహార అతివాదానికి దూరంగా ఉండాలి - 427,428, 429] CDTel 212.1