[C.T.B.H.119] (1890) C.H.450,451 CDTel 262.2
379. ఆరోగ్యసంస్కరణ ఆచరణలో అనేకమంది నిరుత్సాహం చెందటానికి ఓకారణం, సరిగా తయారుచేసిన సామాన్యాహారాన్ని, అనగా తాము అలవాటు పడ్డ ఆహారం స్థానాన్ని తీసుకునే ఆహారాన్ని తయారు చెయ్యటం వారు నేర్చుకోకపోటం. రుచిలేని వంటకాలతో వారు విసుగు చెందుతారు. తర్వాత తాము ఆరోగ్య సంస్కరణను అనుసరించటానికి ప్రయత్నించామని, తాము ఆ విధంగా నివసించలేమని చెబుతారు. అనేకులు ఆరోగ్య సంస్కరణలో కొన్ని ఉపదేశాల్ని మాత్రమే అనుసరించి అనుచితంగా కార్యాచరణ చేపట్టటం వల్ల జీర్ణశక్తికి హానికలగటంతో ఆ ప్రయత్నంలో ఉన్న వారందరికి నిరాశ కలుగుతుంది. మీరు ఆరోగ్యసంస్కర్తలమని చెప్పుకుంటున్నారు. ఆ కారణం వల్లనే మీరు మంచి వంటకత్తెలు వంటగాళ్లు అవ్వాలి. సరిగా జరిపించబడే ఆరోగ్య వంట పాఠశాలల వల్ల ప్రయోజనం పొందేవారు తమ సొంత ఆచరణపరంగాను ఇతరులికి నేర్పించే విషయంలోను వాటి ద్వారా గొప్ప మేలు పొందుతారు. CDTel 262.3