(1868) 2T 63 CDTel 262.4
380. మీ అలవాట్లను మార్చుకోవలసిందిగా మా సలహా. అయితే ఇది చేసేటప్పుడు మీరు అవగాహనతో కదలాలని మా హెచ్చరిక. నాకు తెలిసిన ఓ కుటుంబం మాంసాహారం నుంచి నిస్సారమైన ఆహారానికి మారింది. వారు తయారు చేసుకునే ఆహారం నాసిగా ఉండటం వల్ల దాన్ని కడుపు ఇష్టపడదు. అలాంటివారు ఆరోగ్యసంస్కరణ తమకు పడటం లేదని తమ శారీరకశక్తి సన్నగిల్లుతున్నదని నాకు ఫిర్యాదు చేస్తారు. కొందరు తమ ఆహారాన్ని సరళం చేసుకునే ప్రయత్నంలో సఫలులు కాలేకపోటానికి ఇక్కడ కారణం ఉంది. వారి ఆహారం నిస్సారమైన ఆహారం. ఆహారాన్ని శ్రమ పడకుండా తయారుచేస్తారు. అది ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. ఏ ఒక్క భోజనం లోను పలురకాలుండకూడదు. కాని మూడుపూటలు ఏడు రోజులు మార్పులేకుండ ఒకే భోజనం ఉండకూడదు. ఆహారాన్ని సాదాగా సరళంగా తయారుచెయ్యాలి. అయినా అది చక్కగా ఆకలి పుట్టించేదిగా ఉండాలి. మీ ఆహారం తయారీలో నెయ్యి రకానికి చెందిన నూనెలు వాడకండి. మీరు తయారుచేసే ఏ ఆహారాన్నయినా ఆ నూనె అపవిత్రం చేస్తుంది. పండ్లు కూరగాయలు ఎక్కువగా తినండి. CDTel 262.5
ఉత్తరం 60a, 1896 CDTel 263.1
381. సరిగా ఆహారం వండటం అతిప్రాయుఖ్యమైన సాధన. ముఖ్యంగా మాంసం ప్రధాన ఆహారపదార్థం కానిచోట మంచి వంట అత్యవసర విధి. మాంసం స్థానాన్ని ఇంకేదో తీసుకోవాలి. మాంసం బదులుగా తయారుచేసే ఈ ప్రత్యామ్నాయాల్ని మాంసంపై కోరిక పుట్టని విధంగా తయారుచెయ్యాలి. CDTel 263.2
ఉత్తరం 7a, 1908 CDTel 263.3
382. భోజనబల్లమీదికి ఆహారం తయారుచేసే బాధ్యత గలవారికి గళం ద్వారాను, కలం ద్వారాను ఉపదేశించటం, ఉపదేశించటం, ఉపదేశించటం వైద్యుల ఖచ్చితమైన విధి. CDTel 263.4
(Y.I., మే 31, 1894) CDTel 263.5
383. ఆరోగ్యదాయకంగా వండటం సొంతంగా నేర్చుకునే వ్యక్తులు మనకు అవసరం. అనేకులు మాంసాన్ని, కూరగాయల్ని రకరకాలుగా వండగలరు కానీ సామాన్యమైన కమ్మని వంటకాలు చెయ్యలేరు. CDTel 263.6
[రుచిలేని వంటకాలు-324,327] CDTel 263.7
[శిబిర సమావేశాల ప్రదర్శనలు-763] CDTel 263.8
[మాంసం ప్రత్యామ్నాయాలు 1884 లో సూచించబడ్డాయి-720] CDTel 263.9
[ఆహార పదార్థాన్ని నైపుణ్యంతో అమర్చటం ఆరోగ్యసంస్కరణకు సహాయకరం-710] CDTel 263.10
[మాంసం లేని వంట ఉపదేశంలో నేర్పు, అవగాహన అవసరం-816] CDTel 263.11