(1890) C.T.B.H.156,158 CDTel 264.1
384. వంట చెయ్యటంలో జ్ఞానం, నైపుణ్యం కొరవడినందువల్ల అనేక మంది భార్యలు తల్లులు తమ కుటుంబాలకి సరిగా తయారుచెయ్యని ఆహారం ఇస్తున్నారు. అది వారి జీర్ణ వ్యవస్థని పాడుచేసి, నాణ్యత లేని రక్తాన్ని తయారు చేస్తుంది. ఫలితంగా మంట పుట్టించే వ్యాధి తరచుగా దాడి చేయ్యటం జరిగి మరణం సంభవించవచ్చు..... CDTel 264.2
అందరికి రుచికరంగా ఉండే విధంగా బలవర్థకమైన ఆరోగ్యవంతమైన రకరకాల మంచి ఆహారం తయారు చెయ్యవచ్చు. ఎలా వంట చెయ్యాలో నేర్చుకోటం చాలా ప్రాముఖ్యం. చప్పనివంట వ్యాధిని చెడ్డ మానసిక ప్రవృత్తుల్ని కలిగిస్తుంది. శరీర వ్యవస్థ అస్తవ్యస్తమౌతుంది. ఆధ్యాత్మిక విషయాల అవగాహన ఉండదు. మంచి వంటలో మీ ఊహకు మించినంత మతం ఉంది. కొన్నిసార్లు నేను ఇల్లు విడిచి ఎక్కడికైనా వెళ్లినప్పుడు, భోజన బల్లమీద పెట్టబడ్డ బ్రెడ్డు, ఇతర ఆహారం నాకు మేలు చెయ్యదని గ్రహిస్తాను. కానీ ప్రాణం నిలుపుకోటానికి ఏదో కొంచెం తినక తప్పదు. అలాంటి ఆహారం తయారు చెయ్యటం దేవుని దృష్టికి పాపం. CDTel 264.3