ఉత్తరం 27, 1902 CDTel 281.6
406. ఈ పనిలో ప్రమాదం చాలా ఉంది. భూమి ఇచ్చే ఆరోగ్యవంతమైన ఉత్పత్తి నుంచి ఆరోగ్యదాయకమైన చౌక అయిన ఆహార ఆహారపదార్థాల్ని తయారు చెయ్యటానికి ప్రయోగాలు చెయ్యాలి. CDTel 281.7
ఆహార సంబంధిత వ్యాపారం పట్టుదల గల ప్రార్ధనాంశం కావాలి. ఆరోగ్యవంతమైన ఆహారపదార్థాల్ని తయారుచెయ్యటానికి ప్రజలు వివేకం కోసం దేవున్ని అర్థించాలి! అయిదు రొట్టెలు రెండు చిన్న చేపలతో అయిదు వేలమందికి ఆహారం పెట్టిన ఆయన నేడు తన బిడ్డల అవసరాల్ని తీర్చుతాడు. క్రీస్తు ఈ అధ్బుతం చేసిన తర్వాత పొదుపు పై ఓ పాఠం నేర్పాడు. జనం ఆకలి తీరిన తర్వాత ఆయన “ఏమియు నష్టపడకుండ మిగిలిన ముక్కలు పోగుచేయుడి” అన్నాడు. “వారు... మిగిలిన రొట్టెల ముక్కలు పోగుచేసి పండ్రెండు గంపలు నింపిరి.” CDTel 281.8