ఉత్తరం 188, 1901 CDTel 284.1
410. ప్రతీ స్థలంలోను ప్రజలు భూమి ఉత్పత్తుల్ని తెలివిగా ఉపయోగించాలని దేవుడు కోరుతున్నాడు. ఆహార పదార్ధాల ఉత్పత్తిని సరళీకరించి, ఉత్పత్తి వ్యయాన్ని రవాణా ఖర్చును తగ్గించటానికి వీలుగా వాటిని మిశ్రమం చెయ్యగలమో లేదో తెలుసుకోటానికి ప్రతీ ప్రాంతంలోని ఉత్పత్తుల్ని జాగ్రత్తగా అధ్యయనం చేసి పరిశోధించటం జరగాలి. ప్రభువు పర్యవేక్షణ కింద అందరూ ఈ కార్యసాధనకు తమ శక్తిమేరకు కృషి చెయ్యాలి. మానవ మేధ మిశ్రమం చేయగల ఖరీదైన ఆహార పదార్థాలెన్నో ఉన్నాయి. అయినా ఎంతో ఖరీదైన ఈ ఉత్పత్తుల్ని ఉపయోగించాల్సిన అవసరం నిజంగా లేదు. CDTel 284.2
మూడేళ్ల క్రితం నాకో ఉత్తరం వచ్చింది. అందులో ఇలా ఉంది, “నేను పప్పులతో తయారు చేసిన ఆహార పదార్థాల్ని తినలేను. నా కడుపు వాటిని జీర్ణించుకోలేదు.” ఆ తర్వాత అది అనేక రెసిపిలు నాముందు పెట్టింది. అందులో ఒకటి పప్పులతో ఇతర దినుసులు మిశ్రమం చెయ్యాలని అవి వాటితో చక్కగా కలుస్తాయని కాని వాటిని పెద్ద మొత్తంలో ఉపయోగించకూడదన్నది. మిశ్రమం ప్రకారం పప్పులు పదింట ఒకవంతు నుంచి ఆరింట ఒకవంతు వరకు ఉంటే సరిపోతుంది. ఇది మేము విజయవంతంగా చేసి చూశాం. CDTel 284.3
[ విభాగం XX11 లో “పప్పులు, పప్పు ఆహార పదార్థాలు” చూడండి] CDTel 284.4