ఇతర విషయాలు పేర్కొటం జరిగింది. ఒకటి బిస్కెట్ల వంటి తీపి చిరుతిండ్లు ఎవరో ఒకరికి అవంటే ఇష్టం కనుక వాటిని తయారు చెయ్యటం జరుగుతుంది. వాటిని తినకూడదని అనేకులికి అవి అందుతాయి. ఇంకా ఎంతో అభివృద్ధి జరగాల్సి ఉంది. తనతో పని చేసేవారితో దేవుడు పని చేస్తాడు. CDTel 284.5
[తీపి బ్రెడ్డు, కుక్కీలు, బిస్కెట్టులు-507, 508 చూడండి] CDTel 285.1
[“ఆరోగ్య తీపి వస్తువులు” గా పిలిచేవి కొన్ని హానిలేనివి కావు-530] CDTel 285.2
(1902) 7T 126 CDTel 285.3
411. మన ఆరోగ్య పత్రికలకు రెసిపీలు తయారు చేసేవారు గొప్ప శ్రద్ధ తీసుకోవాలి. ఇప్పుడు ప్రత్యేకంగా తయారు చేస్తున్న ఆరోగ్య ఆహార దార్ధాల్ని మెరుగుపర్చవచ్చు. వాటిని ఉపయోగించటానికి మన ప్రణాళికల్లో సూర్పులు చోటుచేసుకోవాలి. కొందరు పప్పుల తయారీల్ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. “నేను పప్పులతో తయారు చేసిన ఆహార పదార్థాల్ని ఉపయోగించలేను. మాంసం స్థానే నేనేమి తినాలి?” అంటూ అనేకులు నాకు రాస్తారు. ఓ CDTel 285.4
రాత్రి కొందరు ప్రజల ముందు నిలిచి, తమ ఆహారం తయారు చెయ్యటంలో ఎక్కువ పప్పులు వాడుతున్నారని, కొన్ని రెసిపీల్లో సూచించిన రీతిగా వాటిని వాడితే శరీరవ్యవస్థ దాన్ని పరిష్కరించలేదని, వాటిని తగుమాత్రంగా వాడితే దాని ఫలితం ఎక్కువ తృప్తికరంగా ఉంటుందని చెప్పుతున్నట్లు కనిపించింది. CDTel 285.5