(1896) స్పెషల్ టెస్టిమెనీస్, సీరీస్ జు, నెం.9, పు. 54 CDTel 26.2
39. దైవ సేపలో పాటుపడేవారు లోకాశల తృప్తికి స్వార్థ కార్యా ల సిద్ధికి ప్రయత్నించరు. మన ఆసుపత్రులు వైద్య సంస్థల్లోని వైద్యులు ఆరోగ్యసంస్కరణ సూత్రాలతో తమ మనసుల్ని నింపుకోవాలి. క్రీస్తు కృప తమ హృదయాల్లో సజీవ నియమంగా ఉండేంతవరకు మనుషులు మితానుభవాన్ని వాస్తవంగా పాటించరు. లోకంలోని వాగ్దానాలన్నీ మిమ్మల్నిగాని మీ భార్యనిగాని ఆరోగ్య సంస్కర్తగా తీర్చిదిద్దలేవు. కేవలం భోజన నియంత్రణే మీ భోజనలాలసత్వ వ్యాధిని కుదర్చలేదు. తమ హృదయాలు దైవ కృపద్వారా మార్పు చెందే వరకు సోదరుడు, సోదరి -- మితానుభవాన్ని పాటించరు. CDTel 26.3
పరిస్థితులు సంస్కరణల్ని రూపొందించలేవు. హృదయంలో క్రైస్తవం సంస్కరణను ప్రతిపాదిస్తుంది. అంతరంగంలో క్రీస్తు చేసేపని పరివర్తన చెందిన మనసు ఆదేశం కింద జరుగుతుంది. బహిర్గతంగా ప్రారంభించి అంతర్గతంగా పనిచెయ్యటానికి ప్రయత్నించే ప్రణాళిక విఫలమౌతుంది. మీ విషయంలో దేవుని ప్రణాళిక సమస్యలన్నింటికీ కేంద్రమైన హృదయంతో ప్రారంభం కావాలి. అప్పుడు హృదయం నుంచి నీతి సూత్రాలు బయలుదేరాయి. దిద్దుబాటు బయట లోపల జరుగుతుంది. CDTel 27.1
ఉత్తరం 3, 1884 CDTel 27.2
40. దేవుడు తన వాక్యం ద్వారా, తన ఆత్మ సాక్ష్యాల ద్వారా ఇచ్చిన వెలుగు ప్రకారం ఆయన ఆజ్ఞకు సాధ్యమైనంత దగ్గరగా నివసించగోరేవారు దేవుని ఏర్పాటుకు విరుద్ధంగా నివసించే తమ మిత్రులు బంధువుల -వారు ఒకరు లేక ఇద్దరు లేక పెద్ద సమూహం అయినా - కోరికలకు అనుగుణంగా తమ కార్యాచరణ విధానాన్ని మార్చుకోరు. ఈ విషయాల్లో మనం నియమాన్ని అనుసరించి వ్యవహరిస్తే, ఆహార సూత్రాల్ని నిష్కర్షగా ఆచరిస్తే, క్రైస్తవులుగా మన రుచులను దైవ ప్రణాళికకు అనుగుణంగా మలుచుకుంటే మనం దేవుని మనసును రంజింపజేసే ప్రభావాన్ని చూపించగలుగుతాం. “ఆరోగ్య సంస్కర్తలుగా వ్యవహరించటానికి మనం సమ్మతంగా ఉన్నామా?” అన్నదే ప్రశ్నార్థకం. CDTel 27.3
1720 చూడండి] CDTel 27.4