(1909) 9T 153-156 CDTel 27.5
41. ఆరోగ్య సంస్కరణాంశం పై ఒక వర్తమానాన్ని మన ప్రజలకు చేరవేయవలసిందిగా నన్ను ప్రభువు ఆదేశించాడు. ఎందుకంటే ఆరోగ్య సంస్కరణ సూత్రాల సందర్భంగా అనేకులు తమ పూర్వ నమ్మకం నుంచి వెనుతిరుగుతున్నారు. CDTel 27.6
తన బిడ్డలు క్రీస్తులో పరిపూర్ణంగా ఎదిగిన స్త్రీ పురుషులు కావాలన్నది దేవుని సంకల్పం. ఈ స్థితిని చేరటానికి వారు తమ మనసును, ఆత్మ, శరీరాలకు సంబంధించిన ప్రతీ శక్తిని సరిగా వినియోగించాలి. మానసికమైన, శారీరకమైన ఏ శక్తినీ వారు వ్యర్థం చెయ్యకూడదు. CDTel 27.7
ఆరోగ్యాన్ని ఎలా సంరక్షించుకోవాలన్నది ప్రాథమిక ప్రాధాన్యం గల సమస్య. ఈ అంశాన్ని దైవ భీతితో అధ్యయనం చేస్తే, సామాన్యాహారాన్ని భుజించటం మన శారీరక, ఆధ్యాత్మిక అభివృద్ధికి దోహదపడుతుందని తెలుసుకుంటాం. ఈ అంశాన్ని ఓర్పుతో అధ్యయనం చేద్దాం. ఈ విషయంలో ముందుకు సాగటానికి మనకు జ్ఞాన వివేచన అవసరం. ప్రకృతి చట్టాలున్నవి మనం ప్రతిఘటించటానికి కాదు, ఆచరించటానికి, CDTel 28.1
మాంసాహార వంటకాలు, టీ, కాఫీలు, అనారోగ్యకర భోజనాలవల్ల కలిగే కీడు గురించి ఉపదేశం పొందినవారు, వాటిని త్యాగం చేయటం ద్వారా దేవునితో నిబంధన చేసుకోటానికి ధృఢ సంకల్పం కలవారు అనారోగ్యకరమని తమకు తెలిసిన ఆహారాన్ని ఉపయోగించటం కొనసాగించ రు. మన ఆహారాభిరుచులు ప్రక్షాళన కావాలని హానికరమయిన ఆహారపదార్థాల విషయంలో మనం సంయమనం పాటించాలని దేవుడు డిమాండు చేస్తున్నాడు. తన ప్రజలు తన ముందు సంపూర్ణత పొందిన ప్రజలుగా నిలబడక ముందు ఈ పని జరగాల్సివుంది. CDTel 28.2
దేవుని శేషించిన ప్రజలు మారుమనసు పొందిన ప్రజలు. ఈ వర్తమాన ప్రకటన ఫలితంగా మనుషులు మారు మనసు పొంది పరిశుద్దులవ్వాలి. ఈ ఉద్యమంలో మనం దేవుని ఆత్మశక్తిని అనుభవపూర్వకంగా గ్రహించాల్సి వున్నాం. ఇది అద్భుతమైన నిర్ధిష్టమయిన వర్తమానం. దాన్ని అంగీకరించే వారికి అది ఎంతో విలువైనది. దాన్ని గొప్ప స్వరంతో ప్రకటించాల్సి వుంది. ఈ వర్తమానం అధిక ప్రాముఖ్యాన్ని సంతరించుకుంటూ లోకాంతం వరకూ కొనసాగుతుందన్న అచంచల విశ్వాసం మనకుండాలి. CDTel 28.3
సాక్ష్యాలలో కొన్ని భాగాలని దేవుని వర్తమానంగా అంగీకరించి, తమకు ప్రియమైన వ్యసనాల్ని ఖండించే కొన్ని భాగాల్ని విసర్జించే నామమాత్రపు క్రైస్తవులు కొందరున్నారు. అలాంటి వ్యక్తులు తమ సొంత సంక్షేమానికి సంఘసంక్షేమానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. వెలుగుండగా మనం వెలుగులో నడవటం ప్రాముఖ్యం. ఆరోగ్య సంస్కరణ పై నమ్మకం వుందని చెప్పుకుంటూ, తమ దైనందిన జీవితంలో దాని నియమాలకు విరుద్ధంగా వ్యవహరించేవారు తమ సొంత ఆత్మలకు హాని చేసుకుని విశ్వాసులు, విశ్వా సేతరుల మనసుల పై తప్పుడు ప్రభావాన్ని చూపిస్తున్నారు. CDTel 28.4
తమ పనులు తమ విశ్వాసానికి అనుగుణంగా ఉండేందుకు, తమ జీవితాలు శుద్ధీకరణ పరిశుద్ధత పొంది, ఈ అంత్యకాలంలో వేగవంతంగా జరగాల్సిన పనికి సిద్ధపడేందుకు సత్యాన్ని గూర్చిన జ్ఞానం ఎవరికి ఉన్నదో వారి పై ఓ గంభీర బాధ్యత ఉంది. ఆహార వాంఛను తృప్తి పర్చుకోటానికి వారికి సమయం లేదు. ఇప్పుడు ఈ మాటల వర్తమాన ప్రభావం మనపై ప్రబలంగా ఉండాలి “ప్రభువు సముఖము నుండి విశ్రాంతి కాలములు వచ్చునట్లును మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లును మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తమును మారు మనస్సుపొంది తిరుగుడి.” అ.కా. 3:19,20. ఆధ్యాత్మికత లోపించినవారు, ఎవరు సంపూర్తిగా మారుమనసు పొందితేనేగానీ తప్పక నశిస్తారో వారు మన మధ్య చాలామంది ఉన్నారు. ఆ అపాయంలో పడటానికి మీరు సమ్మతిస్తారా?... CDTel 29.1
పరలోక రాజ్యంలో ఆయనతో నూతన జీవితంలో పాలు పొందే వారు అనుభవించాల్సిన హృదయ పరివర్తన క్రీస్తు శక్తి మాత్రమే కలుగజేయగలదు. రక్షకుడంటున్నాడు, “ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడు.” యోహాను 3:3. దేవుని వద్దనుంచి వచ్చే మతం మాత్రమే ఆయన వద్దకు నడిపిస్తుంది. ఆయనకు సరిఅయిన విధంగా సేవ చెయ్యటానికి మనం దేవుని ఆత్మ మూలంగా జన్మించటం అవసరం. ఇది మెలకువగా ఉండటానికి దారి తీస్తుంది. అది హృదయాన్ని పవిత్రపర్చి మనసును నవీకరించి, దేవుని తెలుసుకోటానికి ప్రేమించటానికి మనకు నూతన సామర్థ్యాన్నిస్తుంది. ఆయన ఆజ్ఞలన్నింటికి మనల్ని విధేయుల్ని చేస్తుంది. ఇది నిజమైన ఆరాధన, CDTel 29.2