(1902) 7T 41 CDTel 285.6
412. మన శిబిర సమావేశాల్లో ఆరోగ్యకరమైన, చక్కగా తయారుచేసిన ఆహారం సాధ్యమైనంత చౌకగా బీదలకు లభించేటట్లు ఏర్పాట్లు చెయ్యాలి. ఆరోగ్యదాయక వంటకాలు తయారుచేసి, మనసును ఆకట్టుకునే రీతిగా వడ్డించే హోటళ్లు ఉండాలి. ఇది మన విశ్వాసులు కాని వారికి విజ్ఞాన దాయకంగా ఉంటుంది. శిబిర సమావేశాలకి సంబంధించిన పనితో దీనికి సంబంధం లేదని ఎవరూ భావించకూడదు. దేవుని సేవలో ప్రతీ విభాగం ఇతర విభాగాలతో దగ్గర సంబంధం కలిగి ఉంటుంది. అన్ని విభాగాలు సమైక్యంగా, కలిసికట్టుగా ముందుకి సాగాలి. CDTel 285.7
MS79, 1900 CDTel 285.8
413. ఆసక్తి గల పనివారు మన నగరాల్లో పలురకాల మిషనెరీ సేవలు చేపడ్డారు. ఆరోగ్య హోటళ్లు స్థాపిస్తారు. అయితే ఈ పనిని ఎంత జాగ్రత్తగా చేపట్టాలి! ఈ హోటళ్లలో పని చేసేవారు కమ్మని, ఆరోగ్యవంతమైన ఆహార పదార్థాలు ఎలా తయారు చెయ్యాలో నేర్చుకునేందుకు నిత్యం ప్రయోగాలు చేస్తూ ఉండాలి. ప్రతీ ఆరోగ్య హోటలు దానితో సంబంధమున్న వారికి ఓ పాఠశాల కావాలి. ఈ పని చిన్న స్థలాల్లో కన్నా నగరాల్లో ఎక్కువ స్థాయిలో జరగాలి. అయితే సంఘ పాఠశాల ఉన్న ప్రతిస్థలం లోను ఆరోగ్యనియమాల ప్రకారం నివసించాలని ఆశించేవారికి సామాన్య, ఆరోగ్యదాయక ఆహారం తయారు చెయ్యటం పై ఉపదేశం ఇవ్వటం జరగాలి. మన మిషనెరీ సేవ జరిగే ప్రాంతాలన్నింటిలో ఇలాంటి పని చెయ్యవచ్చు. CDTel 285.9