ఉత్తరం 271, 1905 CDTel 286.5
415. మన నగరాల్లోని హోటళ్లన్నింటిలోను అనేక ఆహార పదార్థాల్ని పాత్రల్లో కలపటంలో ప్రమాదముంది. ఒకే భోజనంలో అనేక రకాల ఆహార పదార్థాల్ని కడుపులోకి తీసుకుంటే కడుపుకి హాని కలుగుతుంది. సామాన్యత ఆరోగ్యసంస్కరణలో ఓ భాగం. మనం చేస్తున్న పని ఏ పేరుతో చేస్తున్నామో ఆ పేరుకి తగినట్టుగా ఉండని ప్రమాదం ఉంది. CDTel 286.6
మనం ఆరోగ్య పునరుద్ధరణకు కృషి చేస్తుంటే ఆహారవాంఛని అదుపులో ఉంచి ఒకే భోజనంలో ఎక్కువ రకాల వంటకాల్ని తినకుండా ఉండటం నింపాదిగా తినటం అవసరం. ఈ ఉపదేశాన్ని తరచుగా పునరుక్తి చెయ్యటం అవసరం. ఒకే భోజనంలో రకరకాల వంటకాల్ని భుజించటం ఆరోగ్య సంస్కరణకు విరుద్ధం. మన పనిలో మత సంబంధమైన భాగం, అనగా ఆత్మకు ఆహారం సమకూర్చటం, అన్నిటికన్నా ముఖ్యమని మనం మర్చిపోకూడదు. CDTel 287.1