ఉత్తరం 112, 1909 CDTel 290.5
421. ఆరోగ్యకరమైన, మానవ శరీరం అంగక్రమ నిర్మాణంలో ఎలాంటి అంతరాయం కలిగించని విధంగా తయారుచేసిన, ఆహారం సరఫరా చెయ్యటం వైద్యుడి కర్తవ్యం. CDTel 290.6
MS 93, 1902 CDTel 291.1
422. వైద్యులు మెలకువగా ఉండి ప్రార్థన చేస్తూ తాము గొప్ప బాధ్యత గల స్థానంలో ఉన్నామని బయలు పర్చాలి. తమ రోగులకి అవసరమైన ఆహారాన్నే వారు నిర్ణచించాలి. మంచి రక్తాన్ని ఉత్పత్తి చెయ్యటానికి మంచి ఆహారం అవసరం గనుక, తన స్థానం ప్రాముఖ్యమైందని గుర్తించే వ్యక్తి ఈ ఆహారాన్ని తయారు చెయ్యాలి. CDTel 291.2
423. నర్సు విధిలో ఓ ప్రాముఖ్యమైన భాగం రోగి ఆహారాన్ని గూర్చిన శ్రద్ధ. పోషకాహారం కొరవడినందుచేత రోగి బాధకు గురి అవ్వటంగాని, అత్యధికంగా బలహీనపడటంగాని లేదా ‘ రోగి బలహీన జీర్ణమండల వ్యవస్థకు పని భారం పెరగటంగాని జరగకూడదు. రుచిగా ఉండేటట్లు ఆహారాన్ని తయారుచేసి వడ్డించటానికి శ్రద్ధ తీసుకోవాలి. అయితే వాసి విషయంలోను రాశి విషయంలోను రోగి అవసరం దృష్టిలో ఉంచుకుని ఆహారం ఇవ్వాలి. CDTel 291.3