ఉత్తరం 213, 1902 CDTel 291.4
424. మాంసాహారంపట్ల శోధన కలగకుండే విధంగా ఆరోగ్యకరమైన ఆహారాన్ని రుచిగా సమృద్ధిగా తయారుచేసి ఆకలి పుట్టేటట్లు ఆకర్షణీయంగా రోగులకు వడ్డించాలి. ఆరోగ్య సంస్కరణలో భోజనాలు ఓ విజ్ఞాన సాధనం కావచ్చు. రోగులకిచ్చే ఆహారంలో చోటుచేసుకునే మిశ్రమం విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. ఆహార పదార్ధాల్ని ఉచితరీతిలో మిశ్రమం చెయ్యటంలో జ్ఞానం గొప్ప విలువైంది. దాన్ని దేవుడిచ్చిన జ్ఞానంగా పరిగణించాలి. CDTel 291.5
ఆసుపత్రి అధికారులు తమ సుఖం కోసం తమ ఆరోగ్యం కోసం పని చేస్తున్నారని రోగులు భావించేరీతిగా భోజన సమయాన్ని ఏర్పాటు చెయ్యాలి. అప్పుడు వారు ఆసుపత్రి నుంచి తిరిగి తమ ఇళ్లకి వెళ్ళేటప్పుడు చెడ్డ అబిప్రాయాలతో వెళ్లరు. భోజనానికి నిర్దేశించిన సమయాలు మార్చరాని చట్టాలుగా రోగులు భావించేటట్లు చేసే ఏ చర్యను ఎట్టి పరిస్థితుల్లోను తీసుకోకూడదు. CDTel 291.6
ఆసుపత్రిలో మూడోపూట భోజనాన్ని మానినప్పటినుంచి ఎక్కువ మంది ప్రజలు రాకపోటం చూసినప్పుడు మీ విధి స్పష్టం. రెండు పూట్లే భోజనం చేయటం వల్ల మేలు పొందేవారు కొందరుండగా, ప్రతి పూటా మితంగా తినేవారు సాయంత్రం తినటం అవసరమని భావించేవారు కొందరుంటారని గుర్తుంచుకోవాలి. స్నాయువుకి కండరానికి శక్తిని సమకూర్చటానికి సరిపోయినంత ఆహారం తినటం అవసరం. మనం తినే ఆహారం నుంచే మన మనసుకి శక్తి చేకూరుతుందని జ్ఞాపకముంచుకోవాలి. మన ఆసుపత్రి పనివారు చెయ్యాల్సిన పనిలో ఓ భాగం ఆరోగ్యదాయకమైన ఆహారం విలువను ప్రదర్శించటం. CDTel 292.1
మన ఆసుపత్రుల్లో టీ, కాఫీలుగాని లేదా మాంసాహారం గాని ఇవ్వకుండటం మంచిదే. అనేకమందికి ఇది పెద్ద మార్పు, తీవ్రమైన లోటు. దినానికి రెండుపూట్ల భోజనం వంటి మార్పులు చెయ్యటం కొందరి విషయంలో మేలుకన్నా కీడు చెయ్యవచ్చు. CDTel 292.2
[విభాగం IX భోజనాల సంఖ్య: భోంచెయ్యటంలో క్రమం చూడండి] CDTel 292.3