రెండు తీవ్ర హద్దులున్నాయి. మనం ఆ రెంటినీ నివారించుకోవాలి. మన వైద్య సంస్థలతో సంబంధమున్న వారెవరూ అరకొర ఆహార సరఫరా ప్రబోధించకుండా ఉండటానికి వారికి దేవుడు సహాయం చేయునుగాక! మన ఆసుపత్రులకు వచ్చే లౌకిక పురుషులు స్త్రీలు వక్రమైన ఆహారేచ్ఛలు కలవారు. వీరందరి విషయంలోను విప్లవాత్మకమైన మార్పులు చెయ్యటం సాధ్యపడదు. ఓ వ్యక్తిగత కుటుంబంలో పెట్టగలిగినట్లు కొందరిని ఒకేసారి ఆరోగ్యసంస్కరణ సాదా ఆహారం పై పెట్టటం సాధ్యపడదు. ఓ వైద్యసంస్థలో అనేక రకాల ఆహారావసరాల్ని తృప్తి పర్చాల్సి ఉంటుంది. కొందరి ప్రత్యే అవసరాలకి చక్కగా తయారుచేసిన కూరగాయలు అవసరమౌతాయి. ఇతరులు కూరగాయలు ఉపయోగించలేరు. ఉపయోగిస్తే తీవ్ర పరిణామాలు ఎదురౌతాయి. పాపం ఆ జీర్తి రోగులకి ప్రోత్సాహపర్చే మాటలు అవసరం. ఆసుపత్రుల్ని క్రైస్తవ గృహ వాతావరణం అలముకోవాలి. ఇది రోగుల ఆరోగ్యానికి దోహదపడుతుంది. వీటన్నింటినీ జాగ్రత్తగాను, ప్రార్థన పూర్వకంగానూ నిభాయించాలి. పరిష్కరించాల్సిన సమస్యలు ప్రభువుకి తెలుసు. ఆయన మీ సహాయకుడిగా పనిచేస్తాడు. CDTel 296.1