కొన్ని విషయాల గురించి నిన్న మీకు రాశాను. అవి మీకు గలిబిలి పుట్టించటం లేదనుకుంటున్నాను. మన ఆసుపత్రుల్లో ఆహారం సమృద్ధిగా ఉండాల్సిన అవసరాన్ని గూర్చి చాలా రాశాను. నేను చాలా వైద్య సంస్థల్ని సందర్శించాను. వాటిలో చాలా సంస్థల్లో ఆహారం ఉండాల్సినంత పుష్కలంగా లేదు. మీకు తెలిసినట్లు, రోగులకి ఆహారం ఇచ్చేటప్పుడు మనం ఒకే రకమైన ఆహారం ఇవ్వకూడదు. ఆహారపదార్థాల పట్టిక మార్చి ఆహారాన్ని వేరు వేరు విధాలుగా తయారుచెయ్యాలి. CDTel 296.2
ఉత్తరం 37, 1904 CDTel 297.1
428. చికిత్స నిమిత్తం మన ఆసుపత్రులకు వచ్చేవారికి చక్కగా వండిన ఆహారం ఉదారంగా సరఫరా చెయ్యాలి. వారి ముందు పెట్టే ఆహారం ఓ కుటుంబంలో చేసేదానికన్నా ఎక్కువ రకాలు తయారుచేసి వడ్డించాలి. ఇది తప్పకచెయ్యాలి. అతిథులకి మంచి అభిప్రాయం కలిగించేటట్లు ఆహారం తయారు చెయ్యాలి. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. రుచిగల ఆహారం ఉదారంగా సరఫరా చేస్తే ఆసుపత్రికి ప్రజాదరణ ఎక్కువగా ఉంటుంది. CDTel 297.2
మన ఆసుపత్రుల భోజన బల్లల నుంచి పదే పదే ఆకలిగా అసంతృప్తిగా లేస్తూ ఉంటారు. ఈ సంస్థల నాయకులతో మాట్లాడాను. ఈ సంస్థలు ఇచ్చే ఆహారం మరింత ఉదారంగా సరఫరా అవ్వాలని, మరింత కమ్మగా ఉండాలని చెప్పాను. అవసరమైన మార్పుని ఉత్తమ మార్గంలో చెయ్యటానికి తమ జ్ఞానవివేకాల్ని ఉపయోగించి కృషి చెయ్యాల్సిందని సూచించాను. ఏది ఆరోగ్యసంస్కర్తల రుచికి అభిరుచికి సరిపోతుందో అది నిత్యం విలాసభోజనం చేసేవారికి సరిపడదని జ్ఞాపకముంచుకోవాలని వారితో చెప్పాను. జయప్రదంగా నడిపే ఆరోగ్య హోటలులో తయారుచేసి వడ్డించే భోజనాలనుంచి ఎంతో నేర్చుకోవచ్చు.... CDTel 297.3