ఉత్తరం 5, 1904 CDTel 335.3
519. తమ భోజన బల్లపై పండ్లు కూరగాయల్ని సరఫరా చేసుకొనేందుకు వాటి సేద్యం నిమిత్తం నేల సంపాదించటంలోని ప్రాముఖ్యాన్ని అనేకులు గుర్తించరు. తమ సొంత రక్షణను భయంతోను, వణకుతోను - తమ దేహం విషయంలో అవివేకంగా వ్యవరహరించి తమ నిమిత్తం ప్రభువు ప్రణాళికను పాడు చేస్తామేమోన్న భయంతో - పని చేసే ప్రతీ కుటుంబానికి, ప్రతి సంఘానికి దేవుడు మీకు తోడుగా ఉంటాడని చెప్పాల్సిందిగా ఆయనను ఆదేశించాడు. CDTel 335.4
[పండ్లతోట నుంచి కూరగాయల తోట నుంచి వచ్చే పండ్లు కూరగాయల విలువను అందరూ గ్రహించాల్సిన అవరసరం ఉంది - 480] CDTel 335.5
ఉత్తరం 195, 1905 CDTel 335.6
520. ఎండబెట్టిన మొక్కజొన్నను సమకూర్చుకోటానికి ఏర్పాట్లు చేసుకోవాలి. గుమ్మడికాయల్ని ఎండబెట్టి చలికాలంలో (చలిదేశాల్లో) పైలు చేసుకోటానికి ఉపయోగించుకోవచ్చు. CDTel 335.7