ఉత్తరం 31, 1901 CDTel 335.8
521. నా ఆహారం గురించి మీరు మాట్లాడున్నారు. నేను ఇంకేదీ తినలేనంతగా ఒకే పదార్థానికి కట్టుబడి లేను. కాని ఆకు కూరలకి సంబంధించినంత వరకు, మీరు ఆందోళన చెందనక్కరలేదు. ఎందుకంటే నాకు ఖచ్చితంగా తెలిసిన దాని ప్రకారం మీరు నివసిస్తున్న ప్రాంతంలో ఆకుకూరలుగా ఉపయోగించుకుంటున్న అనేక రకాల కూరగాయలు మాకున్నాయి. యెల్లోడక్, లేత డేండిలియన్, ఆవమొక్క ఆకులు దొరుకుతాయి. ఇక్కడ ఇవి సమృద్ధిగా లభిస్తాయి. అవి ఆస్ట్రేలియాలో దొరికే వాటికన్నా మెరుగైనవి. ఎక్కువ నాణ్యత గలవి. కాగా ఇంకేమీ లేకపోయినా గింజలు బాగా ఉత్పత్తి అవుతాయి. CDTel 335.9
ఉత్తరం 10, 1902 CDTel 336.1
522. నేను తూర్పుకి వెళ్లటానికి కొంతకాలం ముందు నా ఆకలి పోయింది. కాని ఇప్పుడు తిరిగి వచ్చింది. భోజన సమయం అయ్యేసరికి నాకు బాగా ఆకలవుతుంది. చక్కగా ఉడకబెట్టి, కాచిన మీగడతో నిమ్మరసంతో పోపు పెట్టిన నా తిసిల్ (గ్రీన్‌లు ఎంతో కమ్మగా ఉంటాయి. నేను సేమియా, టమాటోసూపు ఓ పూట, ఆకుకూరలు రెండోపూట తీసుకుంటాను. మళ్లీ బంగాళాదుంప భోజనం తినటం మొదలు పెట్టాను. నా భోజనమంతా రుచిగా ఉంటుంది. అర్ధాకలితో ఉండి, ఎక్కువ తినే ప్రమాదంలో ఉన్న జ్వరం బాధితుడి వంటిదాన్ని నేను. - CDTel 336.2
ఉత్తరం 70, 1900 CDTel 336.3
523. మీరు సంపిన టమాటోలు చాలా బాగున్నాయి. చాలా రుచిగా ఉన్నాయి కూడా. టసూటోలు నాకు మంచి ఆహారపదార్ధమని కనుగొన్నాను. (అనుబంధం 1:16,22,23 కూడా చూడండి] CDTel 336.4
ఉత్తరం 363, 1907 CDTel 336.5
524. మేము మాకు మా పొరుగువారికి సరిపోయేంత ధాన్యం, బటానీ పండించాం. చలికాలంలో ఉపయోగించుకోటానికి మొక్కజొన్నల్ని ఎండబెడతాం. అవసరమైనప్పుడు మిల్లులో వేసి పిండిచేసి వండుకుంటాం. దానితో చేసే సూపు ఇతర వంటకాలు ఎంతో కమ్మగా ఉంటాయి.... CDTel 336.6
వాటి వాటి కాలాల్లో ద్రలు, ఫ్రూన్లు, ఏపిల్లు, కొద్దిగా చెర్రీలు, పీచు, పేర్లు, ఒలీవాలు మాకు పండుతాయి. వాటిని మేమే తయారు చేసుకుంటాం. ఎక్కువ పరిమాణంలో టమాటోలు కూడా పండిస్తాం. నా భోజనబల్లమీద పెట్టిన భోజనం గురించి నేను ఎప్పుడు గొణుగుకోను. గొణుగుకోటం దేవునికి ఇష్టముండదు. మా సందర్శకులు మేము తిన భోజనాన్నే తింటారు. మేము వడ్డించే భోజనాన్ని వారు ఆనందంగా తింటారు. CDTel 336.7
[ఎలెన్ జి. వైట్ ఉపయోగించిన ధాన్యం-అనుబంధం 1:22,23] CDTel 336.8
[పండ్లతో ఉపయోగించటం గురించి హెచ్చరిక-188,190] CDTel 336.9
[డిజర్టులతో (తీపి పదార్ధాలు) కూరగాయల వాడకం గురించి హెచ్చరిక -189,722] CDTel 336.10
[ఎలెన్ జి. వైట్ ఆహారంలో - అనుబంధం 1:4,8,15] CDTel 336.11