MS 93, 1901 CDTel 338.1
525. పంచదార కడుపుకి మంచిది కాదు. అది పులుపు పుట్టిస్తుంది. ఇది మెదడును మసకబార్చి, చిరచిరలాడే స్వభావాన్ని కలిగిస్తుంది. CDTel 338.2
(1905) M.H.302 CDTel 338.3
526. ఆహారంలో సామాన్యంగా చాలా పంచదార ఉపయోగించటం జరుగుతుంది. కేకులు తీపి ఫుడ్డింగులు, పేస్త్రీలు, జెల్లీలు అజీర్తికి ప్రధాన కారణాలు. పాలు, గుడ్లు, పంచదార ప్రధాన దినుసులుగా ఉన్న కస్టడ్స్, ఫుడ్డింగులు ప్రధానంగా హానికరమైనవి. పాలు, పంచదార కలిపి విచ్చలవిడిగా ఉపయోగించటం మానాలి. CDTel 338.4
[పాలు, పంచదార- 533, 536 చూడండి] CDTel 338.5
[పండ్లు క్వేన్ చెయ్యటంలో కొంచెమే ఉపయోగించండి-476] CDTel 338.6
[కొంచెం పంచదార అనుమతించవచ్చు-550] CDTel 338.7
(1870) 2T 369,370 CDTel 338.8
527. పంచదార వ్యవస్థకి అడ్డుపడుతుంది. జీవ యంత్రాంగం చేసే పనికి అంతరాయం కలిగిస్తుంది. CDTel 338.9
మిచిగన్ రాష్ట్రంలోని మాంట్ కామ్ కౌంటీలో ఓ వ్యక్తి సంగతిని ప్రస్తావిస్తాను. అతడు ఓ యజమాని. ఆరడుగుల ఎత్తరి. సుందరుడు. అతడు జబ్బుగా ఉండగా అతణ్ని సందర్శించాల్సిందిగా నన్ను కోరారు. తన జీవన విధానం గురించి క్రితంలో నేను అతడితో మాట్లాడాను. “నీకళ్లు ఆరోగ్యంగా కనిపించటం లేదు” అన్నాను. అతడు పంచదార విపరీతంగా తింటున్నాడు. అలా ఎందుకు చేస్తున్నావని అతడ్ని ప్రశ్నించాను. తాను మాంసాహారం మానేశానని, దానికి మారుగా పంచదార కన్నా మెరుగైంది మరేదీ కనిపించలేదని బదులు పలికాడు. తన భార్యకు వంట చెయ్యటం రాదు కాబట్టి తన ఆహారం తనకు తృప్తి నివ్వలేదని చెప్పాడు. CDTel 338.10
దాదాపు స్త్రీ దశకు చేరిన మీ కుమార్తెలు వంట నేర్చుకోటం ప్రాముఖ్యమైన విషయం కావాల్సి ఉండగా వారు వంట నేర్చుకోక ముందు వారిని మీలో కొందరు విజ్ఞాన శాస్త్రం నేర్చుకోటానికి విద్యాలయాలకి పంపుతున్నారు. ఇక్కడ వంట చెయ్యటం తెలియని ఓ స్త్రీ ఉన్నది. ఆరోగ్యవంతమైన ఆహారం తయారుచెయ్యటం ఆమె నేర్చుకోలేదు. విద్యలో ఈ ప్రాముఖ్యమైన విభాగంలో భార్య, తల్లి అయినా ఆమె కొరవడి ఉన్నది. పర్యవసానంగా, చప్పగా వండిన భోజనం శరీర వ్యవస్థకు అవసరమైన పోషణను అందించలేకపోటంతో అతడు పంచదారను అమితంగా తినటం, అది అతడి వ్యవస్థ అంతటినీ రోగగ్రస్తం చెయ్యటం జరిగింది. ఈ వ్యక్తి జీవితం నిస్సారమైన వంటకు ఆహుతి అయ్యింది. CDTel 339.1
జబ్బుగా ఉన్న ఆ వ్యక్తిని చూడటానికి నేను వెళ్లినప్పుడు, పరిస్థితి ఎలా అధిగమించాలో నాకు తెలిసినంతవరకు చెప్పటానికి ప్రయత్నించాను. త్వరలో అతడు నెమ్మదిగా కోలుకోటం మొదలు పెట్టాడు. కాని అతడు బుద్ధిహీనంగా తన శక్తికి మించి పనులు చేసి, సరియైన నాణ్యత లేని ఆహారం కొద్దిగా తిన్నాడు. అతడు మళ్లీ జబ్బు పడ్డాడు. ఈసారి అతడికి సహాయం లభించలేదు. అతడి శరీర వ్యవస్థ పూర్తిగా చెడిపోయి జీవిస్తున్న శవమయ్యాడు. అతడు అనుచిత వంటకు బలి అయ్యాడు. వంటలోపాన్ని భర్తీ చెయ్యటానికి పంచదారని ఆశ్రయించాడు. అది పరిస్థితిని విషమింపజేసింది. CDTel 339.2
నేను తరచు సహోదరులు, సహోదరీలతో భోజనానికి కూర్చుంటూ ఉంటాను. వారు పాలు, పంచదార ఎక్కువగా వాడటం చూస్తుంటాను. ఇది శరీర వ్యవస్థలో అడ్డుపడి, జీర్ణమండల అవయవాల్లో అసౌకర్యం, బాధ కలిగించి, మెదడుని ప్రభావితం చేస్తాయి. జీవిత యంత్రాంగం చలనాన్ని అడ్డుకునేదేదైనా మెదడును ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తుంది. పంచదారను ఎక్కువగా ఉపయోగించినప్పుడు అది మాంసాహారం కన్నా ఎక్కువ హాని చేస్తుందని నాకు దేవుడిచ్చిన వెలుగు చెబుతున్నది. ఈ మార్పుల్ని జాగ్రత్తగా చేయాలి. మనం ఎవరికి ఈ విషయాలు బోధించి సహాయం చెయ్యటానికి ప్రయత్నిస్తామో వారిని విసిగించి వారిలో దురభిప్రాయం సృష్టించని రీతిగా ఈ అంశాన్ని ప్రస్తావించాలి. CDTel 339.3
[తియ్య ని బ్రెడ్, క్రేకర్లు - 110,507,508] CDTel 339.4
(R.&.H. జనవరి 7, 1902) CDTel 340.1
528. శరీరానికి అనారోగ్యస్థితి కలిగించే ఏ పదార్ధాన్ని నోటిలో పెట్టుకోటానికి మనం సమ్మతించ కూడదు... అది మనకు ఎంత ఇష్టమైనప్పటికీ. ఎందుకు? ఎందుకంటే మనం దేవుని సొత్తు. మనం జయించి పొందవలసిన కిరీటముంది, సాధించవలసిన పరలోకముంది, తప్పించుకోవలసిన నరకం వుంది. కనుక స్పష్టమైన కాంతితో క్రీస్తు వెలుగు మీ ముందు ప్రకాశించాలని ఆశించి ఆతర్వాత దానినుంచి తొలగిపోయి “నేను దీన్ని, దాన్ని ప్రేమిస్తున్నాను” అంటారా? అని క్రీస్తుని బట్టి మిమ్మల్ని అడుగుతున్నాను. మనం ఆయన జతపనివారమయ్యేందుకోసం ప్రణాళికలు వేసుకోటానికి, తన గొప్ప సంరక్షణలోను ప్రేమలోను, ఆత్మను, శరీరాన్ని, స్వభావాన్ని ఉద్ధరించి, ఉన్నతపర్చి, పరిశుద్ధపర్చటంలో దేవునితో సహకరించటానికి ప్రారంభించాల్సిందిగా ఆయన మీలో ప్రతీ ఒక్కరికీ పిలుపునిస్తున్నాడు.... CDTel 340.2
తీపి వస్తువుల్ని ముట్టకుండా ఉండటం మంచిది. భోజన బల్లమీద పెట్టిన తీపి పదార్ధాల జోలికి పోకండి. అవి మీకవసరం లేదు. దేవుని చిత్త ప్రకారం ఆలోచించేందుకు మీకు నిర్మలమైన మనసు కావాలి. CDTel 340.3
[భాగం III లో పై, కేక్, పేస్టీ, పుడ్డింగులు చూడండి] CDTel 340.4
[ప్రసిబిడ్డలకి ఇవ్వకూడని క్యాండీ-546] CDTel 340.5