ఉత్తరం 45, 1903 CDTel 370.3
609. నేను రెండుపూటలే భోంచేస్తాను. ముప్పయి అయిదేళ్ల కిందట నాకు వచ్చిన వెలుగునే ఇంకా అనుసరిస్తున్నాను. మాంసం తినను. బటర్ సమస్యని నేను వ్యక్తిగతంగా పరిష్కరించుకున్నాను. దాన్ని ఉపయోగించను. స్వచ్చమైన పదార్ధం దొరకని ప్రతీచోట ఈ సమస్యని సులువుగా పరిష్కరించవచ్చు. మాకు పాలిచ్చే రెండావులున్నాయి. ఒకటి జెర్సీ ఆవు, రెండోది హోస్టెన్ ఆవు. మేము వెన్న ఉపయోగిస్తాం. ఇది మాకెంతో తృప్తినిస్తున్నది. CDTel 370.4
(ఉత్తరం 331, 1904) M.M.269 CDTel 370.5
610. పండ్లు, శుభ్రమైన వెన్న సమృద్ధిగా లభించేచోట బటర్ అవసరం నాకు కనిపించదు. CDTel 370.6
[సందర్భానికి 588 చూడండి] CDTel 370.7
ఉత్తరం 5, 1870 CDTel 370.8
611. మా భోజనబల్ల మీద మేము బటర్ ఉంచం. కూరగాయల్ని మేము పాలతోగాని వెన్నతోగాని వండుతాం. అవి ఎంతో రుచిగా ఉంటాయి.... ఆరోగ్యంగా ఉన్న ఆవుపాలు మితంగా ఉపయోగించుకోటంలో అభ్యంతరం లేదని మా భావన. ” CDTel 370.9
[వైట్ గృహంలో వాడే పాలు, వెన్న - అనుబంధం 1:4, 13,14,16,22] CDTel 370.10
[ఆహారం తయారుచెయ్యటంలో పాలు, వెన్న వినియోగం-517,518,522] CDTel 370.11
[శిబిర సమావేశాలకి సిఫారసు చేసిన ఆహారం-191] CDTel 370.12