MS 3, 1897 CDTel 402.4
675. మాంసాహారం తీవ్రమైన సమస్య. మానవులు చచ్చిన జంతువుల మాంసం తిని నివసించాలా? దేవుడు నాకిచ్చిన వెలుగును బట్టి దానికి జవాబు లేదని చెప్పాలి. ఈ అంశంపై ఆరోగ్యసంస్కరణ సంస్థలు ఉపదేశం అందించాల్సిన అవసరం ఉంది. మానవ యంత్రాంగాన్ని గూర్చి అవగాహన ఉన్న వైద్యులు చచ్చిన పశువుల మాంసం తినటానికి తమ రోగుల్ని ప్రోత్సహించకూడదు. జంతు ప్రపంచంలో పెరుగుతున్న వ్యాధుల్ని గూర్చి వారు వివరించాలి. జంతు పరీక్షలు జరిపేవారు సాక్ష్యం చెబుతున్నదేంటంటే జబ్బులేని జంతువులు బహు తక్కువని, మాంసం తినటంవల్ల క్యాన్సర్లు, కంతులు, క్షయ, ఇంకా అలాంటి ఇతర వ్యాధులు సంక్రమిస్తున్నాయని. CDTel 402.5
(1905) M.H.280 CDTel 402.6
676. మాంసం భుజించేవారు తాము ఏమి తింటున్నారో ఎరుగరు. ఆ జంతువులు బతికి ఉన్నప్పుడు వాటిని చూసి, తాము తినే మాంసం నాణ్యతని ఎరిగితే, అసహ్యించుకుని దానినుంచి తిరిగి వెళ్లిపోటం తరచుగా జరుగుతుంది. మనుషులు నిత్యం క్షయ, క్యాన్సరు క్రిములతో నిండిన మాంసంతింటున్నారు. క్షయ, క్యాన్సరు, ఇంకా ఇతర ప్రాణాంతక వ్యాధులు ఈ రకంగా వ్యాప్తి చెందుతున్నాయి. CDTel 402.7
(1905) 3T 563 CDTel 402.8
677. క్రైస్తవులుగా చెప్పుకునే అనేకమంది స్త్రీలు తమ భోజన బల్లలమీద కడుపులో తాపం పుట్టించి, వ్యవస్థకు జ్వర పరిస్థితిని కలిగించే వంటకాల్ని ఏర్పాటుచేస్తారు. కొన్ని కుటుంబాల భోజన బల్లలమీద ముఖ్యమైన ఆహారంగా మాంసమే ఉంటుంది. ఇది వారి రక్తం క్యాన్సరు, కంతులతో నిండేలా ఉంటుంది. తాము ఏమి తింటారో అదేవారి దేహాన్ని నిర్మిస్తుంది. కాని వ్యాధి, బాధ వచ్చినప్పుడు, అది దేవుడు పంపిన శ్రమ అని భావించటం జరుగుతుంది. CDTel 402.9