[C.T.P.H.47] (1890) C.H.115 CDTel 403.1
678. మాంస పదార్థాల్ని విరివిగా తీసుకునే వారికి మసకబారని మెదడు, చురుకైన బుద్ధి ఎల్లప్పుడు ఉండవు. ఎందుకంటే జంతువుల మాంసం తీసుకోటం శరీరాన్ని స్థూలం చేసి, మానసిక శక్తుల్ని మొద్దు బార్చుతుంది. CDTel 403.2
జనరల్ కాన్ఫరెన్స్ బులిటన్, ఏప్రి.12,1901 CDTel 403.3
679. తన ప్రజల గ్రహణశక్తులు నిర్మలంగా ఉండి వారు కఠినంగా పని చెయ్యటానికి సమర్ధులై ఉండాలని దేవుడు కోరుతున్నాడు. కాని మాంసాహారులైతే, మీ మనసు ఫలప్రదంగా ఉంటుందని ఎదురు చూడకూడదు. తలంపులు శుద్ధి పొందాలి. అప్పుడే దేవుని దీవెనలు తన ప్రజల మీద ఉంటాయి. CDTel 403.4
(1868) 2T 62,63 CDTel 403.5
680. మాంసాహారులు స్పష్టమైన మెదడు, చురుకైన బుద్ధి కలిగి ఉండటం అసాధ్యం, CDTel 403.6
(1896) E. from U. T.4 CDTel 403.7
681. శరీర సంబంధమైన క్రియలని గూర్చి ఆందోళనకరమైన అలసత్వం కనిపిస్తుంది. చచ్చిన జంతువుల మాంసం తినటం ఆచారమయ్యింది. ఇది మానవ యంత్రాంగంలో నీచ ఉద్రేకాల్ని ప్రోత్సహిస్తుంది. CDTel 403.8
E. from U. T.7 CDTel 403.9
682. మాంసాహారం చిత్తవృత్తిని మార్చి, పాశవికతని బలపర్చుతుంది. మనం ఏమి. తింటామో అది మన శరీరాల్ని నిర్మిస్తుంది. మాంసాహారం మానసిక క్రియాత్మకతని హరిస్తుంది. విద్యార్ధులు ఎన్నడూ మాంసం తినకుండా ఉంటే వారు తమ చదువుల్లో మరెక్కువ సాధిస్తారు. మాంసాహారం వల్ల మానవుడిలో పాశవిక భాగం బలపడినప్పుడ బుద్ధి సంబంధమైన శక్తులు ఆ నిష్పత్తిలోనే తగ్గుతాయి. మాంసాహారం విడిచి పెడితే, మత జీవితాన్ని జయప్రదంగా ప్రారంభిచి కొనసాగించవచ్చు. ఎందుకంటే ఈ ఆహారం శరీర సంబందమైన చిత్త వృత్తుల్ని క్రియాత్మక మవ్వటానికి ప్రోత్సహించి, మానసిక, ఆధ్యాత్మిక స్వభావాన్ని బలహీన పర్చుతుంది. CDTel 403.10