MS 133, 1902 CDTel 415.1
711. అనేకమంది తల్లిదండ్రులు బుద్ధిలేని వారిలా వ్యవహరిస్తారు. వక్రరుచుల వల్ల నీచమైన ఉద్వేగాల వల్ల వారు మందమతులు నిష్కియాపరులు అవుతారు. సత్యం ఎరిగిన మన వాక్య పరిచారకులు ప్రజల్ని తమ జడత్వ పరిస్థితి నుంచి మేల్కొలిపి, మాంస పదార్థాలకి ఆకలి సృష్టించే వాటిని విసర్జించటానికి నడిపించాలి. సంస్కరణని అశ్రద్ధ చేస్తే, వారు ఆధ్యాత్మికంగా బలహీనులై పాప క్రియల్లో ఇంతలంతలుగా కూరుకుపోతారు. పరలోక విశ్వానికి హేయమైన అలవాట్లు మానవుల్ని జంతువులకన్నా తక్కువ స్థితికి దిగజార్చే అలవాట్లని అనేక గృహాల్లో అనుసరిస్తున్నారు. సత్యం తెలిసినవారందరు “ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను” విసర్జించమని ప్రజలకు ప్రబోధించాలి. CDTel 415.2
మన వాక్య పరిచారకుల్లో ఎవరూ మాంసాహారం తినటం ద్వారా చెడు ఆదర్శం నెలకొల్పకుందురుగాక. మన వాక్యపరిచారకులు తమ స్వభావాన్ని తమ బిడ్డల స్వభావాన్ని పాశవికం చెయ్యకుందురుగాక. ఏ పిల్లల కోరికలు నియంత్రించబడవో వారు సామాన్యంగా అమితానుభవ అలవాట్లకు బానిసలవ్వటమే గాక క్షుద్ర ఉద్రేకాలకి లోనై ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తూ పవిత్రతను సచ్ఛీలాన్ని నిర్లక్ష్యం చేస్తారు. తమ శరీరాల్ని దుర్వినియోగపర్చటానికే కాదు తమ దురాలోచనలతో ఇతరుల్ని చెరపటానికి కూడా సాతాను వీరిని నడిపిస్తాడు. తల్లిదండ్రుల్ని పాపం అంధుల్ని చేస్తే ఈ విషయాన్ని గ్రహించటంలో వారు విఫలులవుతారు. CDTel 415.3
నగరాల్లో నివసించే తల్లిదండ్రులకు : మీ బిడ్డల్ని మీ గృహాల్లోకి రప్పించి కాపాడుకోండి; దేవుని ఆజ్ఞల్ని నిర్లక్ష్యం చేస్తూ దుర్మారతను అనుసరించే వారినుంచి మీ పిల్లల్ని పోగుచెయ్యండి అంటూ ప్రభువు హెచ్చరిస్తున్నాడు. సాధ్యమైనంత త్వరితంగా నగరాల్ని విడిచి పెట్టండి అంటున్నాడు. CDTel 416.1
రక్తనాళాల్లో ప్రవహించే రక్తాన్ని చెడురక్తంగా మార్చే మాంసాహారం స్థానాన్ని తీసుకోటానికి కూరగాయలు పండ్లు సాగుచేసుకోటానికి గాను పండ్లతోటలు కూరగాయల్ని పెంచగల స్థలాన్ని గ్రామీణ ప్రాంతాల్లో సంపాదించటానికి తల్లిదండ్రులు ప్రయత్నించవచ్చు. CDTel 416.2