టీ, కాఫీలు తాగే అలవాటు మనం ఊహించటానికన్నా ఎక్కువ హానికరమైంది. ఉత్సాహం కలిగించే పానీయాలకి అలవాటు పడ్డ అనేకులు తలనొప్పి, నరాల బలహీనతతో బాధపడ్డారు. వ్యాధులకి గురి అయి ఎంతో సమయాన్ని కోల్పోతారు. ఆ ప్రేరకం లేకుండా బతకలేమని ఊహించు కుంటారు. తమ ఆరోగ్యం పై అది చూపే ప్రభావాన్ని గుర్తించరు. దాన్ని మరింత ప్రమాదకరం చేసేదేమిటంటే, దాని దుష్పలితాలకి ఇతర కారణాలు చెపుతూపోతుండటం. CDTel 440.1