(1905) M.H.227,228 CDTel 466.4
773. అనారోగ్యకరమైన అభ్యాసాల్ని విడిచి పెట్టటం కూడా మనుషులకి నేర్పిస్తే తప్ప, తమ బలహీనతల్ని బాగుపర్చేవాడుగా దేవుని వంక చూడటం వారికి నేర్పటానికి చేసే ప్రయత్నం విఫలయత్నమౌతుంది. ప్రార్థనకు జవాబుగా దీవెనలు పొందటంలో కీడు చెయ్యటం మాని మేలు చెయ్యటం వారు నేర్చుకోవాలి. ప్రకృతి సంబంధమైన ఆధ్యాత్మిక సంబంధమైన దైవ చట్టాలకు అనుగుణంగా వారు నివసించాలి. CDTel 466.5