774. ప్రకృతి చట్టాలకు విధేయులై నివసించటానికి, ఆరోగ్యాన్ని నాశనం చేసే ఆహారాభ్యాసాలు తప్పుడు అలవాట్లను విడిచి పెట్టటానికి, వస్త్రధారణలో దేవుని నియమాలకు విరుద్ధమైన లోక అలవాట్లు ఆచారాల్ని తోసిపుచ్చటానికి బాధలో ఉన్నవారికి నేర్పించటానికి రోగుల ఆరోగ్య సంస్థలు ఉత్తమ స్థలాలు. వారు ప్రకృతి సంబంధమైన, ఆధ్యాత్మిక సంబంధమైన దైవ చట్టాలు రెండింటికీ అనుగుణంగా నివసించాలి.... CDTel 466.6
వ్యాధికి చికిత్స విషయంలో తమ దుర్బలతకు కారణాల్ని తెలుసు కోవాలని కోరేవారికి ఆసక్తిగా ఉపదేశించటానికి వైద్యులు సంస్కర్తలు ఇప్పుడు నిర్ణయాత్మకంగా కృషి చేస్తూ సేవను పురోగమింప జెయ్యాల్సిన అవసరముంది. దేవుడు స్థాపించిన చట్టాలకు వారి ప్రత్యేక గమనాన్ని తిప్పాల్సి ఉంది. ఆ చట్టాల్ని అతిక్రమించి ఎవరూ శిక్ష తప్పించుకోలేరు. వారు వ్యాధి పై ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు. కాని వ్యాధి నివారణకు పరిశుద్ధంగా వివేకంగా ఆచరించాల్సిన చట్టాల్ని సాధారణంగా ఆచరించరు. ముఖ్యంగా తన ఆహార అలవాట్లలో వైద్యుడు కచ్చితంగా లేకపోతే, అతడి సొంత ఆహార వాంఛ సామాన్య, ఆరోగ్యకర ఆహారానికి పరిమితం కాకపోతే, చచ్చిన జంతువుల మాంసాన్ని తీసుకోటం విసర్జించకపోతే అతడు అనారోగ్యకరమైన ఆహారానికి రుచి పెంచుకుంటాడు. అతడి అభిప్రాయాలు సంకుచితమైనవి. అతడు మంచి ఆరోగ్యసంస్కరణ సూత్రాల్ని ఎంత ఉద్రేకంగా బోధిస్తాడో తాను ప్రేమించేవాటిని ప్రేమించటానికి అంతే ఉద్రేకంలో తన రోగుల రుచుల్ని ఆహార వాంఛని తర్బీతు చేసి క్రమపర్చుతాడు. రోగులకి ‘మాంసం మిక్కిలి హానికరమైనా మాంసం తిండికి చికిత్సాదేశాలిస్తాడు. ఉద్రేకం పుట్టించడం తప్ప మాంసం శక్తినివ్వదు. తమ పూర్వ అలవాట్లను పరీక్షించుకుని, అనేక సంవత్సరాలుగా తమలో వ్యాధికి పునాది వేస్తున్న దురభ్యాసాల్ని వారు గుర్తించరు. CDTel 467.1
అజ్ఞానంలో ఉన్నవారిని చైతన్యపర్చేందుకు మనస్సాక్షిగల వైద్యుల్ని సన్నద్ధం చెయ్యాలి. తమకు తెలిసిన హానికరమైన పదార్ధాలున్న ఆహారాన్ని నిషేధిస్తూ ఆ వైద్యులు తమ చికిత్సాదేశాలివ్వాలి. ఆరోగ్య సూత్రాలకు విరుద్ధంగా ఉన్నవని తాము ఎరిగిన విషయాల్ని వారు స్పష్టంగా వివరించి, బాధలో ఉన్నవారిని తాము చెయ్యగలిగిన వాటిని చెయ్యనిచ్చి, తద్వారా జీవిత చట్టాలకు ఆరోగ్య చట్టాలకు అనుగుణంగా నివసించటానికి వారిని విడిచి పెట్టాలి. CDTel 467.2
[వైద్యులు, వారి సహాయకులు తమ రుచులను తర్బీతు చేసుకోటం తమ విధి-720] CDTel 468.1
[ఆరోగ్యకరమైన వంటచెయ్యటానికి కలం ద్వారాను గళం ద్వారాను ప్రజల్ని చైతన్యపర్చటం వైద్యుల బాధ్యత-382] CDTel 468.2
[హెల్త్ రిటీ (ఆరోగ్యాశ్రమం) లోని రోగుల్ని మాంసాహారం విసర్జించటానికి చైతన్యపర్చాలి-720] CDTel 468.3