[C.T.B.H.121] C.H.451,452 CDTel 468.6
776. రోగుల్ని స్వస్తపర్చటానికే కాక వ్యాధి బాధల్ని నివారించటానికి ఉత్తమ మార్గాల్ని మన అందుబాటులో ఉన్నవారందరికీ ఉపదేశించటం ద్వారా ఎంతో మేలు చెయ్యవచ్చు. తమ వ్యాధుల స్వభావం వాటికి కారణాల్ని గూర్చి తన రోగులకు విశదం చేసి వాటిని నివారించటానికి పాటుపడే వైద్యుడి కృషి నల్లేరు పై బండినడక కాబోదు. కాని అతడు మనస్సాక్షిగల సంస్కర్త అయితే, తినటం తాగటం వస్త్రాలు ధరించటంలో అమితత్వపు నాశనకరమైన ఫలితాల్ని గురించి తమను ప్రస్తుత స్థితికి తెచ్చిన తమ జీవ శక్తులపై అధిక భారం గురించి అతడు తన రోగులతో నిష్కర్షగా కరాఖండిగా చెబుతాడు. ప్రకృతి అలసిపోయి తన పోరాటాన్ని విడిచి పెట్టేసే వరకు మందుల వినియోగం ద్వారా కీడును మరింత ఎక్కువ చెయ్యకుండా సరియైన అలవాట్లు ఎలా దిద్దుకోవాలో తన సామాన్య నివారణ సాధనాల్ని వివేకంగా వినియోగించటం ద్వారా ప్రకృతి దాని పునరుద్ధరణ కార్యాన్ని నిర్వహించటంలో ఎలా తోడ్పడాలో అతడు తన రోగులకి నేర్పిస్తాడు. CDTel 468.7
మన ఆరోగ్య సంస్థలన్నింటిలోను ఆరోగ్య చట్టాల పై ఉపదేశం ఇచ్చే సేవకు ప్రత్యేక స్థానం కల్పించాలి. రోగులకు వారి సహాయకులకు అందరికీ ఆరోగ్య సంస్కరణ సూత్రాల్ని జాగ్రత్తగా సమర్పించాలి. ఈ సేవ చెయ్యటానికి నైతిక ధైర్యం అవసరం. ఎందుకంటే ఆ కృషి వల్ల పలువురికి మేలు కలుగగా ఇతరులకి అభ్యంతరం కలుగుతుంది. అయితే క్రీస్తు యదార్ధ శిష్యుడు, అనగా ఎవరి మనసు దేవుని మనసుతో సామరస్యం కలిగి ఉంటుందో అతడు, నిత్యం నేర్చుకుంటూ, నిత్యం బోధిస్తూ, లోకంలో ప్రబలుతున్న దుష్టతకు ఇతరుల మనసుల్ని దూరంగా పరలోకం దిశగా నడిపిస్తాడు. CDTel 469.1