(1902) 7T 74,75 CDTel 468.4
775. అనుచిత ఆహారపానాల వల్ల ఒక వ్యక్తి రోగి అయి బాధపడటం ఓ వైద్యుడు కనుగొన్నప్పటికీ దాన్ని గురించి రోగికి చెప్పి దాని దిద్దుబాటు అవసరాన్ని నొక్కి చెప్పకపోతే అతడు సాటి మనిషికి హాని చేస్తున్న వాడవుతాడు. తాగుబోతులు, ఉన్మాదులు, విచ్చలవిడి ప్రవర్తన గలవారువీరందరికీ తామనుభవిస్తున్న బాధ పాప పర్యవసానమని వైద్యులు స్పష్టంగా చెప్పాలి. ఆరోగ్య సంస్కరణ పై మనకు గొప్ప వెలుగు వచ్చింది. అయితే వ్యాధికి కారణాల్ని తొలగించటానికి మనం ఎందుకు ధృఢ నిశ్చయంతో పనిచెయ్యటంలేదు? బాధతో సాగుతున్న నిత్యపోరాటం చూస్తూ, బాధను తగ్గించటానికి నిత్యం శ్రమపడుతూ ఉన్న మన వైద్యులు ఎలా మౌనంగా ఉండగలరు? హెచ్చరిస్తూ గళమెత్తకుండా నిమ్మకు నీరెత్తినట్లు వారు మిన్న కుండగలరా? వ్యాధి నివారణ మార్గంగా నిష్కర్ష అయిన మితానుభవాన్ని బోధించకపోతే వారు దయ, కనికరం గలవారవుతారా? CDTel 468.5