(1900) 67 370,371 CDTel 475.2
784. ఆరోగ్య సంస్కరణను గురించి ప్రతీ సంఘంలోను ప్రకటించాల్సిన వర్తమానం ఉంది. ప్రతీ పాఠశాలలోను చెయ్యాల్సిన పని ఉంది. ఈ అంశం గురించి ఆచరణాత్మకమైన జ్ఞానం సంపాదించేవరకు ప్రిన్సిపాలికి గాని ఉపాధ్యాయులికి గాని యువత విద్యాబాధ్యతలు అప్పగించ కూడదు. కొందరు ఆరోగ్యసంస్కరణ నియమాల్ని విమర్శిస్తారు, ప్రశ్నిస్తారు, తప్పుపడ్డారు. చెప్పాలంటే వారికి వాటిపై అనుభవపూర్వక జ్ఞానం ఏమీ ఉండదు. ఈ దిశలో చిత్తశుద్ధితో పనిచేస్తున్నవారితో భుజం కలిపి నిలబడాలి. అనేక సంఘాల్లో ఆరోగ్య సంస్కరణ అంశం సమర్పించటం జరుగుతుంది. కానీ ఆ వెలుగుని సభ్యులు హృదయపూర్వకంగా అంగీకరించటం లేదు. దేవుని ఆ మహాదినం కోసం ఓ జనాంగాన్ని సన్నద్ధం చెయ్యాల్సి ఉన్న వర్తమాన ప్రభావాన్ని పురుషులు, స్త్రీల స్వార్ధపూరితమైన, ఆరోగ్యాన్ని నాశనంచేసే వాంఛలు నిర్వీర్యం చేస్తున్నాయి. మన సంఘాల సభ్యులు ఈ అంశం పై దేవుని వెలుగును నిర్లక్ష్యం చేస్తే దాని పర్యవసానాన్ని ఆధ్యాత్మిక, శారీరక క్షీణతలో అనుభవిస్తారు. ఈ సంఘాల్లోని పాత సభ్యుల ప్రభావం కొత్తగా విశ్వాసంలోకి వచ్చినవారిని పులియబెడుంది. మారు మనసు పొందని సభ్యుల కారణంగానూ, ఒకప్పుడు మారుమనసు పొందిన ఇప్పుడు విశ్వాస ఘాతకులైన సభ్యుల కారణంగాను సంఘంలోకి అనేక ఆత్మల్ని తీసుకురావటానికి ప్రభువు ఇప్పుడు పనిచెయ్యటం లేదు. ప్రతిష్ఠితులు కాని ఈ సభ్యులు నూతన విశ్వాసుల పై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తారు? తన ప్రజలు ప్రకటించటానికి ఆయన ఇచ్చిన వర్తమానాన్ని వారు నిర్వీర్యం చెయ్యరా? CDTel 475.3