(1902) 7T 62 CDTel 476.1
785. సంఘంలోని ప్రతీ సభ్యుడూ వైద్య మిషనెరీ సేవను చేపట్టాల్సిన సమయానికి మనం వచ్చాం. లోకం ఓ ఆసుపత్రి. అందులో శారీరక, ఆధ్యాత్మిక వ్యాధిగ్రస్తులున్నారు. దేవుడు మనకిచ్చిన సత్యాల జ్ఞానం లేక అన్ని చోట్ల ప్రజలు నశించిపోతున్నారు. ఈ సత్యాల్ని అందించటంలో తమ బాధ్యతను గుర్తించేందుకు సంఘ సభ్యులు మేల్కోవాల్సిన అవసరం ఉంది. సత్యం వలన వికాసం పొందినవారు లోకానికి వెలుగు అందించేవారుగా నివసించాలి. ఈ సమయంలో వెలుగు దాచుకోటం భయంకర తప్పిదం. నేడు దైవ ప్రజలకు వస్తున్న వర్తమానం ఇది, “నీకు వెలుగు వచ్చియున్నది, లెమ్ము తేజరిల్లుము. యెహోవా మహిమ నీ మీద ఉదయించెను.” CDTel 476.2
ఎంతో వెలుగు ఎంతో జ్ఞానం ఉన్నవారు మంచి బదులు చెడును బాహాటంగా ఎంపిక చేసుకోటం ప్రతీ చోట చూస్తున్నాం. దిద్దుబాటుకి ఎట్టి ప్రయత్నమూ చేయకుండా వారు నానాటికీ మరింత దుర్మార్గులవు తున్నారు. అయితే దైవ ప్రజలు చీకటిలో నడవకూడదు. వెలుగులో నడవాలి. ఎందుకంటే వారు సంస్కర్తలు. CDTel 476.3