ఉత్తరం 7a, 1896 CDTel 512.3
15. మాది పెద్ద కుటుంబమన్నాను గదా. అందులోని సభ్యులు పదహారు మంది ఉంటారు. అందులోని కొందరు పొలం దున్నుతారు, చెట్లు నరుకుతారు. వీరికి మంచి వ్యాయామం లభిస్తుంది. కాని వారి భోజనబల్లమీద జంతువుల మాంసం కొంచెం కూడా పెట్టం. బటన్ శిబిర సమావేశం జరిగిన నాటినుంచి మేము మాంసం ఉపయోగించటం లేదు. ఏ సమయంలోను నా భోజన బల్లమీద మాంసం ఉపయోగించటం నా ఉద్దేశం కాదు. కాని ఫలానా వ్యక్తి ఇది తినలేడు అది తినలేడు అని అతడి కడుపు ఇతర భోజనం కన్నా మాంసాహారాన్ని బాగా జీర్ణించు కోగలుగుతాదని విజ్ఞాపనలు చెయ్యటం జరిగింది. ఈ రకంగా నా భోజన బల్లపై మాంసం ఉంచటానికి నన్ను శోధించటం జరిగింది.... CDTel 512.4
నా భోజన బల్లకు వచ్చే వారందరినీ స్వాగతిస్తాను. కాని వారి ముందు మాంసం పెట్టను. గింజలు, కూరగాయలు, తాజా పండ్లు, క్యాన్ చేసిన పండ్లు మా భోజనం. ప్రస్తుతం శ్రేష్ఠమైన నారింజలు, నిమ్మకాయలు సమృద్ధిగా ఉన్నాయి. సంవత్సరంలో ఈ కాలంలో లభించే పండ్లలో ఉత్తమమైంది నారింజొక్కటే..... CDTel 512.5
మేము ఎలా నివసిస్తామో మీకు కొంత అవగాహన కలిగించేందుకే ఇది రాస్తున్నాను. ప్రస్తుతం నా ఆరోగ్యం మున్నెన్నడూ లేనంత బాగా ఉంది. ఇప్పుడు నిర్వహిస్తున్నంత రాత పని మును పెన్నడూ చెయ్యలేకపోయాను. ఉదయం మూడు గంటలకు నిద్రలేస్తాను. దినంలో నిద్రపోను. తరచు రాత్రి ఒంటి గంటకు లేస్తాను. నా మనసు భారంతో కుంగి ఉన్నప్పుడు పన్నెండు గంటలకు మేల్కొని నామనసుకు సమర్పితమైన విషయాన్ని రాస్తాను. నా పట్ల తన కృపాబాహుళ్యం నిమిత్తం హృదయంతోను ఆత్మతోను స్వరంతోను ప్రభువుకి స్తోత్రం చెల్లిస్తాను. CDTel 513.1