MS 82, 1901 CDTel 513.4
17. నేను కూరంగ్ బంగ్ లో ఉన్నప్పుడు మాంసాహారులు మా కుటుంబంలోకి వచ్చార’. అసలు మాంసం కనిపించని మా భోజనబల్ల వద్ద మాతో భోజనానికి కూర్చున్నప్పుడు, “ఇలాంటి భోజనముంటే, మాంసాహారం మానెయ్యగలం” అన్నారు. మా ఆహారం మా కుటుంబాలికి తృప్తినిస్తున్నదని నా నమ్మకం. నా కుటుంబంతో నేనిలా చెబుతాను, “మీరు ఏమి చేసినా పోషణలేని పేదరికాహారం తినకండి. శరీర వ్యవస్థకు పోషణనిచ్చే ఆహారాన్ని చాలినంత మీ భోజనబల్లపై పెట్టండి. ఇది మీరు తప్పక చెయ్యాలి. మీరు నిత్యం కొత్త విషయాలు కనుగొంటూ అధ్యయనం చేస్తూ మీ ఆహారం పౌష్ఠికత సమకూర్చేందుకు గాను ఉత్తమ వంటకాల్ని రూపొందించుకోండి”. CDTel 513.5