[C.T.B.H.49,50] (1890) C.H.118 CDTel 86.4
135. కేవలం వక్రతిండి వాంఛను తృప్తి పర్చుకోటం తప్పు కనుక, మనం తినే ఆహారం గురించి మనం ఉదాసీనంగా ఉండ కూడదన్నది ముఖ్యం. అది ఎంతో ప్రాధాన్యం గల విషయం. పోషణ ఇవ్వని ఆహారాన్ని ఎవరూ ఎంపిక చేసుకో కూడదు. అనే కులు వ్యాధి మూలంగా దుర్బలులౌతున్నారు. వారికి చక్కగా ఉడికిన బలవర్ధకాహారం అవసరం. ఆరోగ్య సంస్కర్తలు, ముఖ్యంగా ఈ విషయంలో అతివాదులు కాకూడదు. శరీరానికి బలవర్ధకాహారం, తాను సృజించి ప్రేమిస్తున్న మనుషులకి నిద్ర ఇచ్చే దేవుడు వారి శారీరక వ్యవస్థ ఆరోగ్యస్థితిలో ఉండేందుకు వారికి సరియైన ఆహారాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నాడు. CDTel 86.5
(1905) M.H.271 CDTel 87.1
136. మంచి ఆరోగ్యానికి మంచి రక్తం అవసరం. ఎందుకంటే రక్తమే జీవిత ప్రవాహగతిని నిర్ధరిస్తుంది. వ్యర్థాన్ని బాగుచేస్తుంది. దేహాన్ని పోషిస్తుంది. సరియైన ఆహారం ద్వారా పోషకపదార్థాలు సరఫరా అయినప్పుడు స్వచ్ఛమైన గాలితో కలయిక వల్ల శుద్ధమైన శక్తి పొందినపుడు, అది శరీరంలో ప్రతీ భాగానికి జీవాన్ని, శక్తిని అందిస్తుంది. రక్త ప్రసరణ ఎంత ఎక్కువ పరిపూర్ణంగా ఉంటే ఈ ప్రక్రియ అంత మెరగుగా సాగుతుంది. CDTel 87.2
[చాలినంత ఆహారానికి మానసిక ఆరోగ్యానికి గల సంబంధం-314) CDTel 87.3
[చాలినంత ఆహారానికి ఆరోగ్యవంతమైన ఆధ్యాత్మికానుభవానికి గల సంబంధం -324, పేరా 4] CDTel 87.4