Go to full page →

నేల సిద్ధబాటు COLTel 35

విత్తువాడి ఉపమానం మంత విత్తటం తాలూకు వేర్వేరు ఫలితాలు నేల మీద ఆధారపడి ఉన్నట్లు క్రీస్తు సూచించాడు. ప్రతి సందర్బాలోను విత్తేవాడు అతడే విత్తనముగా అదే. మన హృదయాల్లోను జీవితాల్లోను దైవ వాక్యం దాని కార్యాన్ని సాధించడంలో విఫలమైతే దానికి కారణం మనలోనే ఉందని ఆయన ఈ విధంగా బోధిస్తున్నాడు. ఫలితం మనం అదుపు చెయ్యలేనిది కాదు. నిజమే మనలో మనం మార్పు చేసుకోలేం అయితే ఎంపిక చేసుకొనే శక్తి మన సొంతం. మనం ఏమి కానున్నామో నిర్ధారించుకోవడం మన మీదే ఆధారపడి ఉంటుంది. దారి పక్క, రాతినేలన ముళ్ళ పొదల శ్రోతలు అలాగే ఉండిపోనవసరం లేదు. మనుషుల్ని ఐహకి విషయాల్లో నిమగ్నమై ఉంచే వ్యామోహ శక్తిని నాశనం చేసి అక్ష్యయమైన ధనానికి అకాంక్షను మేల్కొలిపేందుకు దేవుని ఆత్మ సర్వదా సిద్ధంగా ఉన్నాడు. మనుష్యులు పరిశుద్దాత్మను ప్రతిఘటించటం ద్వారా దైవ వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తారు. మంచి విత్తనం వేళ్ళు తన్నకుండా హృదయం కఠినమవ్వటానికి విత్తనం వృద్ధి చెందకుండా అడ్డుకునే కలుపు మొక్కల పెరుగుదలకు వారే బాధ్యులు. హృదయమనే తోటను సేద్యం చేయ్యాలి. పాపం నిమిత్తం తీవ్ర పశ్చాత్తాపం ద్వారా నేలను దున్నాలి. సాతాను తాలూకు విషపూరితమైన హనికరమైన మొక్కల్ని కుక్కటి వేళ్ళతో పెరికివేయాలి. ముళ్ళ పొదలు పెరిగి ఉన్న నేలను కఠిన పరిశ్రమ ద్వారా మాత్రమే తిరిగి సంపాదించగలుగుతాము. అలాగే స్వాభావిక హృదయ దుర్మార్గతను యేసు నామంలోను ఆయన శక్తితోను చేసే కృషి ద్వారా మాత్రమే జయించగలుగుతాం. తన ప్రవక్త ద్వారా మనల్ని “ముళ్ళ పొదలలో విత్తనములు చల్లక మీ బీడు పొలములను దున్నుడి”. అని ప్రభువు ఆదేశిస్తున్నాడు. యిర్మీ 4:3 “నీతి ఫలించునట్లు మీరు విత్తనము వేయుడి ప్రేమయను కోతను మీరు కోయుడి. హోషే 10:12 మనకు ఇదిచెయ్యాలని ఆయన ఆశిస్తున్నాడు. తనతో సహకరించాల్సిందిగా మనల్ని ఆయన కోరుతున్నాడు. COLTel 35.1

హృదయాలు సువార్తను స్వీకరించటానికి గాను విత్తువారు హృదయాల్ని సిద్ధం చేయ్యాలి. వాక్య పరిచర్యలో ప్రసంగించటం ఎక్కువగా వాస్తవమైన వ్యక్తిగత పరిచర్య అవసరం ఎంతయినా ఉంది. క్రీస్తు వంటి సానుభూతితో మనం వ్యక్తిగతంగా మనుష్యులికి దగ్గరై నిత్య జీవాన్ని గూర్చిన సంగతుల పట్ల ఆసక్తి కలిగించాలి. వారి హృదయాలు జనం నడిచే దారిలా గట్టుగా ఉండటంతో వారికి క్రీస్తుని బోధించడం వ్యర్ధ ప్రయాసగా కనిపించవచ్చు. అయితే హేతువాదం నిష్పలమై తర్కం శక్తిహీనం కాగా వ్యక్తిగత పరిచర్యలో వెల్లడయ్యే క్రీస్తు ప్రేమ కఠిన హృదయాన్ని మెత్తబర్చవచ్చు. సత్య విత్తనం వేరు పారవచ్చు. COLTel 36.1

ముళ్ళ పొదలు విత్తనాన్ని అణగదొక్కకుండా లేక మన్ను తక్కువగా ఉన్నందు వల్ల విత్తనం నాశనం కాకుండా విత్తేవారు చేయాల్సింది కొంత ఉంది. క్రైస్తవ జీవితం ప్రారంభములో ప్రతి విశ్వాసికి పునాది సూత్రాలు బోధించడం జరగాలి. కేవలం క్రీస్తు ప్రాణత్యాగం ద్వారానే తాను రక్షణ పొందలేడని, తాము క్రీస్తు జీవించినట్లు జీవించి ఆయన వంటి ప్రవర్తనను కలిగి ఉండాలని అతడికి బోధించాలి. భారాలు మోస్తూ స్వాభావిక కోర్కెల్ని ఉపేక్షించాలని అందరికి నేర్పించాలి. క్రీస్తు సేవ చేయ్యటం. ఆత్మ త్యాగ స్పూర్తితో ఆయన్ని వెంబడించడం మంచి సైనికులుగా కాఠిన్యాల్ని సహించడం ధన్యతని వారు నేర్చుకుంటరు గాక. ఆయన ప్రేమను నమ్మి తమ చింతల్ని ఆయన పై మోపుదురు గాక. ఆత్మల్ని సంపాదించుటలోని ఆయన ఆనందాన్ని వారు చవి చూచుదురు గాక, నశించిన వారి పట్ల తమ ప్రేమసక్తుల్లో వారు స్వార్ధాన్ని మర్చిపోతారు. ఐహిక సుఖభోగాలు వాటి ఆకర్షక శక్తిని భారాలు నిరుత్సాహపర్చే శక్తిని కోల్పోతాయి. సత్యపు నాగటికర్రు దాని పని అదే చేస్తుంది. అది బీడు భూమిని బద్దలు చేస్తుంది. అది కేవలం ముళ్ళ పొదల కొనల్ని నరకదు వాటిని వేళ్ళతో పెళ్ళగిస్తుంది. COLTel 36.2